Brahmamudi Serial: సుభాష్ ట్విస్ట్ అదిరింది.. అనామిక, రుద్రాణిలకు దిమ్మతిరిగే షాక్..!

బాబు కావాలనుకుంటే రాజ్ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కండీషన్ పెడుతుంది అపర్ణ. మరో వైపు కంపెనీలో రాజ్ స్థానాన్ని కొడుకు రాహుల్ కు ఇవ్వాలని రుద్రాణి, కాదు కళ్యాణ్ కే ఇవ్వాలని అనామిక పంచాయితీ పెడతారు. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi Serial: సుభాష్ ట్విస్ట్ అదిరింది.. అనామిక, రుద్రాణిలకు దిమ్మతిరిగే షాక్..!

Brahmamudi Serial: రాజ్ బిడ్డ కోసం కావ్య బొమ్మలు  కొనుక్కొని వెళ్తూ ఉంటుంది. అటు వైపుగా వెళ్తున్న కావ్య అమ్మ కనకం, కృష్ణమూర్తి కూతురుని చూసి బాధపడతారు. రాజ్ కూతురికి చేసిన మోసాన్ని తలుచుకొని కోపంతో రగిలిపోతుంది కనకం.

publive-image

ఆ తర్వాత కావ్య దగ్గరికి వెళ్లిన కనకం.. ఏంటమ్మా పరిస్థితులకు తలొంచవా. నీ భర్త చేసిన మోసాన్ని నిలదీయడం మానేసి.. అయన కొడుక్కి బొమ్మలు మోస్తూ కూర్చున్నావా అని కూతురి పై సీరియస్ అవుతుంది. ఇప్పుడే వెళ్లి పోలీస్ కంప్లైంట్ చేద్దాం. మీడియా ముందే నిలదీద్దాం. ఆ దుగ్గిరాల కుటుంబం ఏం సమాధానం చెప్తుందో చూద్దాం అని రాజ్ పై మండిపడుతుంది.

publive-image
ఇక కావ్య.. ఇవి ఇవి సరిపోతాయా నా మొగుడి పరువు తీయడానికి అని వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో కనకం, కృష్ణమూర్తి షాకవుతారు. ఆ తర్వాత కావ్య తన పుట్టింటికి భర్త రాజ్ చేసిన సహాయాలను గుర్తుచేస్తుంది. దీంతో కనకం అల్లుడు దేవుడెనమ్మా కానీ నీకు కీడు చేశాడు కదా అని కన్నీళ్లు పెట్టుకుంది.

publive-image

మరో వైపు రాజ్ ఆఫీస్ బిడ్డను తీసుకెళ్లాడని తెలియడంతో అందరు తనను నిలదీయాలని ఎదురుచూస్తూ ఉంటారు. ఇంటి పరువు తీస్తున్నాడని తల్లి అపర్ణ కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

publive-image
ఇంతలో రాజ్ వస్తాడు.. అతడు రాగానే ఇంట్లో అందరు తనను సూటిపోటీ మాటలు అనడం మొదలు పెడతారు. ఇక రాజ్ ఆఫీస్ లో రాజ్ పదవిని లాక్కొని కొడుకు రాహుల్ కు ఇవ్వాలని ఆలోచిస్తున్న రుద్రాణి ఇదే ఛాన్స్ అని రాజ్ విషయంలో అపర్ణను రెచ్చగొడుతుంది.

publive-image
కొడుకు రాజ్ తప్పు చేశాడు భావించిన అపర్ణ.. ఆ తప్పుకు శిక్ష వేయాలని అనుకుంటుంది. బాబు కావాలా..? ఇంటి వారసుడిగా కంపెనీ బాధ్యలు చూసుకుంటావా..? ఒకవేళ బాబు కావాలనుకుంటే కంపెనీ బాధ్యతలు నుంచి తప్పుకోవాలని కండీషన్ పెడుతుంది. దీంతో అంతా షాకవుతారు.

publive-image

తల్లి నిర్ణయాన్ని గౌరవించిన రాజ్.. అధికారం కోసం రక్త సంబంధాన్ని వదులుకోలేను. నిజంగా నేను అనర్హుడిని అని మీరు భావిస్తే.. బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. ఇది వినగానే రుద్రాణి తెగ సంతోషపడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిపోడ్ లో కంపెనీలో రాజ్ స్థానాన్ని కొడుకు రాహుల్ కు ఇవ్వాలని రుద్రాణి, కాదు కళ్యాణ్ కే ఇవ్వాలని అనామిక పంచాయితీ పెడతారు.

publive-image

Also Read: Pushpa 2 Teaser: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. పుష్ప-2 టీజర్ రిలీజ్ ఆ రోజే ..!

Advertisment
తాజా కథనాలు