Brahmamudi Serial: హాల్లో ఇంటి సభ్యులు అంతా కూర్చొని ఉంటారు. ఇంతలో రుద్రాణి .. నీ కోడలిని టీ పెట్టమనొచ్చు కదా అని ధాన్యలక్ష్మితో అంటుంది. దీంతో ధాన్యలక్ష్మి.. ఏ నీ కోడలిని పెట్టమనొచ్చు కదా అని వెటకారంగా సమాధానం చెప్తుంది. ఇందంతా వింటున్న స్వప్న.. ఇంటి కోడళ్ళు ఏమైనా టీ మాస్టర్లా.. మీ టీ మీరే పెట్టుకొని తాగండి అని అందరికీ కౌంటర్ వేస్తుంది.
ఆ తర్వాత పై గదిలో నుంచి బాబు గట్టిగా ఏడుస్తున్న శబ్దం వస్తుంది. దీంతో రుద్రాణి బాబు ఏడుస్తుంటే నానమ్మ హృదయం కరగట్లేదా..? తాతయ్య కూడా తాటి గింజలా సైలెంట్‌గా ఉండిపోయాడు అని అపర్ణ, సుభాష్ పై సెటైర్లు వేస్తుంది రుద్రాణి.
ఇంతలో గుడికి వెళ్లిన కావ్య ఇంటికి వస్తుంది. ఆ తర్వాత బాబు ఏడుపు గురించి తెలుసుకున్న కావ్య కంగారుగా గదిలోకి వెళ్లి.. రాజ్ చేతిలో ఉన్న బాబును తీసుకుంటుంది. బాబు ఒళ్ళు కాలిపోవడంతో జ్వరం వచ్చిందని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని చెప్తుంది.
రాజ్, కావ్య, సుభాష్ బాబును తీసుకొని హాస్పిటల్ కి వస్తారు. మరో వైపు ఇంట్లో అందరూ బాబు క్షేమంగా తిరిగి రావాలని కంగారు పడుతుంటారు. బాబు కండీషన్ చూసిన డాక్టర్ కొంత సమయం అబ్సర్వేషన్ లో ఉంచాలని చెప్తుంది.
బాబు పరిస్థిని పూర్తిగా పరిశీలించిన డాక్టర్ షాకింగ్ విషయం చెప్తుంది. బాబుకు తల్లి పాలు, తల్లి అవసరం చాలా ఉంది. వెంటనే బాబును తల్లికి దగ్గర చేయాలి అని చెప్తుంది.
ఆ తర్వాత రాజ్, సుభాష్, కావ్య హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు. జరిగిన విషయం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తారు. దీంతో అపర్ణ బిడ్డ తల్లి ఎవరో ఇప్పడికైనా చెప్పమని కొడుకును గట్టిగా నిలదీస్తుంది. బాబుకు తల్లి కావలి , నీ భార్యకు న్యాయం కావాలి, ఇంట్లో ఎలాంటి అనర్ధం జరగకముందే నిజం చెప్పు అని ఇందిరాదేవి కూడా అడుగుతుంది.
కానీ రాజ్ మాత్రం క్షమించు నానమ్మ ఇప్పుడు నేను ఏమీ చెప్పలేనని దాటేయడానికి ప్రయత్నిస్తాడు. అసలు నిజం బయట పెట్టలేని రాజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. దాంతో రాజ్ తండ్రి సుభాష్ నిజం బయపెడతానని చెప్తాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: Mirai Movie: సూపర్‌యోధగా తేజ సజ్జ.. ‘మిరాయ్’ గ్లింప్స్ అదిరిపోయింది..!