Brahmamudi Serial: అనామిక, స్వప్న ఆఫీస్ కు వెళ్లినభర్తల కోసం భోజనం ప్యాక్ చేస్తూ ఉంటారు. ఇద్దరు పోటీపడి మరీ బాక్స్ సైజ్ లు పెంచుతారు. ఇంతలో అక్కడికి వచ్చిన కావ్య.. లంచ్ తీసుకెళ్తున్నారా..? లేదా అన్నదానం చేయడానికి వెళుతున్నారా అని సైటైరిక్ గా మాట్లాడుతుంది.
ఆ తర్వాత కావ్య భోజనం చేయడానికి అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది. భోజనం అంతా అనామిక, స్వప్న తీసుకెళ్లడంతో కావ్యకు తినడానికి ఏమీ మిగలదు. దీంతో కావ్య నీళ్లు తాగేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రాణి.. అయ్యో నువ్వు బాలింతరాలివి..తినకపోతే ఎలా అని కావ్య పై సెటైర్స్ వేస్తుంది.
ఇక భోజనం తీసుకొని అనామిక, స్వప్న ఆఫీస్ కు వెళ్తారు. మరో వైపు రాహుల్ ఎంప్లాయి శృతిని లైన్ లో పెట్టేందుకు ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత స్వప్న భోజనం తీసుకొని రాహుల్ దగ్గరకు వస్తుంది. భార్య రాగానే .. నా కోసం భోజనం తెచ్చావా..? అని సంతోషపడతాడు రాహుల్.
అసలు విషయం తెసులుసుకున్న స్వప్న.. తెచ్చి తప్పు చేశానని ఫీల్ అవుతున్నాను అంటూ భర్త పై సీరియస్ అవుతుంది. వచ్చిన మొదటి రోజే అమ్మాయిల జోలికి వెళ్లడం మొదలు పెట్టావా.. సిగ్గు లేదా నీకు అని రాహుల్ కు క్లాస్ పీకుతుంది.
మరో వైపు కళ్యాణ్ ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాడు. ఇక భోజనం తీసుకొని వచ్చిన అనామిక ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ కళ్యాణ్ మాత్రం చిరాకు పడతాడు.
ఇంట్లో రాజ్ తన బిడ్డను ఆడిస్తూ ఉంటాడు. ఇది చూసిన రుద్రాణి, ధాన్యలక్ష్మి.. బాబుకు నామకరణం, బారసాల చేశారో లేదో కనుక్కున్నారా అని అపర్ణ ముందు ఎగతాళి చేస్తూ మాట్లాడతారు. దీంతో అపర్ణ మీరు బంధువులా...రాబందులా అని వాళ్ళ పై ఫైర్ అవుతుంది.
బిడ్డ తల్లి వెన్నెలను కనిపెట్టడానికి రాజ్ ఫ్రెండ్ శ్వేతా సహాయం తీసుకుంటుంది. ఆమె ద్వారా రాజ్ , వెన్నెలకు మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకుంటుంది. ఆ తర్వాత శ్వేత, కావ్య ఇద్దరు కలిసి రాజ్ కు తెలియకుండా వెన్నెలను కనిపెట్టాలని ప్లాన్ చేస్తారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో రాజ్ కావ్యను పుట్టింటికి వెళ్లిపొమ్మని చెప్తాడు.
Also Read: Family Star: రియల్ ‘ఫ్యామిలీ స్టార్’ ఇంటికి.. ఫ్యామిలీ స్టార్ టీమ్ .. వీడియో వైరల్