Brahmamudi Serial: భర్తను వేరే అమ్మాయితో.. అలా చూసి గుండెలు పగిలేలా ఏడ్చిన కావ్య.. నెక్స్ట్ ఏం చేయనుంది

భర్త రాజ్ ను శ్వేతతో దగ్గరగా చూసిన కావ్య గుండెలు పగిలేలా బాధపడుతుంది. రెస్టారెంట్ లో పని చేస్తున్న అప్పు.. అక్కడ అనామిక, కళ్యాణ్ సరదాగా కనిపించడం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఇలా అక్కా చెల్లలు ఎమోషన్స్ తో బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

New Update
Brahmamudi Serial: భర్తను వేరే అమ్మాయితో.. అలా చూసి గుండెలు పగిలేలా ఏడ్చిన కావ్య.. నెక్స్ట్ ఏం చేయనుంది

Brahmamudi Serial: కావ్య ఆఫీస్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. రాజ్ చేతుల మీదుగా కావ్యకు ఆఫర్ లెటర్ ఇవ్వాలని తండ్రి సుభాష్ ఆర్డర్ వేశారు. ఇక తండ్రి మాట కోసం ఇష్టం లేకపోయిన భార్యకు ఆఫర్ లెటర్ అందించి ఆఫీస్ లోకి వెల్కమ్ చెప్పాడు.

publive-image కావ్య ఆఫీస్ కు రావడం ఇష్టంలేని రాజ్ ఆమెను వీలైనంత త్వరగా అక్కడి నుంచి పంపించేయాలని చిరాకు పడుతూ మనసులో తిట్టుకుంటాడు. ఆ తర్వాత కావ్య చెప్పినట్లు శృతి డిజైన్స్ వేయడంతో.. రాజ్ శృతి పై సీరియస్ అవుతాడు. చెప్పినట్లు చేయకపోతే జాబ్ లో నుంచి తీసేస్తాను అంటూ శ్రుతిని హెచ్చరిస్తాడు.

publive-image

కొత్త కోడలు అనామిక భర్త కళ్యాణ్ ఇద్దరు సరదాగా లంచ్ చేయడానికి రెస్టారెంట్ కు వెళ్తారు. అక్కడ కూడా భర్తను ఆఫీస్ కు వెళ్ళమని కాల్చుకు తింటుంది అనామిక. ఇంతలో అక్కడ డెలివరీ కోసం వచ్చిన అప్పును చూసిన అనామిక కావాలనే భర్తతో మరింత క్లోజ్ గా, ప్రేమగా మాట్లాడుతుంది. ఇది చూసిన అప్పు కన్నీళ్లు పెట్టుకుంది.

publive-image
ఆఫీసులో ఉన్న రాజ్ కు సడన్ గా కాల్ చేసిన శ్వేతా.. తన భర్త అరవింద్ వచ్చాడు.. చాలా భయంగా ఉంది అని చెప్పగానే.. వెంటనే వస్తున్నానని రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది విన్న కావ్య రాజ్ ను ఫాలో అవుతూ వెళ్తుంది.

Also Read: Brahmamudi Serial: ఆఫీస్ లోకి కావ్య గ్రాండ్ ఎంట్రీ .. కుళ్ళుకొని చస్తున్న అత్తాకోడళ్ళు

publive-image

ఇంతలో శ్వేతా ఇంటికి ఎంట్రీ ఇచ్చిన భర్త అరవింద్.. ఆమెను కొడుతూ సైకోలా బిహేవ్ చేస్తాడు. ఆస్తి నా పేరు మీద రాయాలని బెదిరిస్తాడు. వెంటనే అక్కడికి వచ్చిన రాజ్ శ్వేతా భర్త అరవింద్ ను కొడతాడు. ఇది చూసిన అరవింద్ మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అనుమానిస్తాడు.

publive-imageఅరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక.. శ్వేతా ఏడుస్తూ ఉంటుంది. నీకు నేను ఉన్నాను.. నీ బాధ్యత నాది అంటూ రాజ్ శ్వేతకు దైర్యం చెప్తాడు. బాధలో ఉన్న శ్వేతా రాజ్ భుజం పై తల పెట్టి ఏడుస్తూ ఉంటుంది.

publive-image

భర్తను ఫాలో అవుతూ వచ్చిన కావ్య ముందు జరిగిన విషయాలు తెలియక.. పరాయి అమ్మాయితో తన భర్త చెప్పిన మాటలు, అంతా దగ్గరగా ఉండడం చూసి గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇక నిజం తెలియని కావ్య భర్తను ఏం చేయబోతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సింది.

publive-image

Also Read: Anchor Sreemukhi : పింక్‌ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫొటోలు చూస్తే ఫ్లాట్‌ అవ్వాల్సిందే

Advertisment
తాజా కథనాలు