Brahmamudi Serial: కావ్యపై దండయాత్ర.. కాఫీతో షాక్ ఇచ్చిన కొత్త కోడలు..అనామిక టార్గెట్ ఇదేనా..!

అనామికను తప్పించి.. అప్పూతో కవి పెళ్లి చెయ్యాలని కావ్య ప్లాన్ చేసిందనుకొని కుటుంబసభ్యులంతా కావ్యపై తిట్లతో దండయాత్ర చేస్తుంటారు. కొత్త కోడలు అనామిక అందరికి కాఫీ ఇస్తుంది. ఆ కాఫి తాగిన కుటుంబ సభ్యలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతారు.

New Update
Brahmamudi Serial: కావ్యపై దండయాత్ర.. కాఫీతో షాక్ ఇచ్చిన కొత్త కోడలు..అనామిక టార్గెట్ ఇదేనా..!

Brahmamudi Serial Today Episode: కావ్యపై ఇంట్లో అందరూ తిట్లతో దండయాత్ర చేస్తున్నారు. నిజానికి కావ్య అనామికకు ఎంతో మేలు చేసింది. ఎండిపోయిన మొక్కను మార్చింది. తన చెల్లి అప్పూ ప్రేమ గురించి తెలియకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేసింది. సేటు తన అప్పు కోసం గొడవ చేసి పెళ్లి ఆపుతాను అంటుంటే.. అది చాటుగా విని.. రాజ్‌ని అనామికా వాళ్ల దగ్గరకు తీసుకెళ్లింది. సేటుకి రూ. 2 కోట్లు ఇప్పించేలా చేసింది. కావ్య చేసిన మంచి అయితే భర్త రాజ్ కు తప్ప ఎవరికి తెలియదు కాబట్టి అందరూ ఆమెను చిదరించుకుంటూ ఉంటారు. అపర్థం చేసుకుని అవమానిస్తు ఉంటారు. భర్త రాజ్ ఒక్కడే కావ్యకు (Kavya) సపోర్టు గా ఉంటాడు.

Brahmamudi Serial Today Episode

మరోవైపు హీరో తమ్ముడు కళ్యాణ్ శోభనం ఏర్పాట్లు మొదలయ్యాయి. కొత్త కోడలు అనామికను తన తల్లిదండ్రులు కావ్యపై ఉసుగొలుపుతారు. కావ్యని ఇంట్లో దొంగ దెబ్బ తీయ్యాలి తప్ప.. డైరెక్ట్ ఎటాక్ చేసి చెడ్డదానివి కావద్దని.. నటిస్తూనే దెబ్బ కొట్టులని సలహా ఇస్తారు. ఆ సలహా విన్న అనామిక  ఇక చెలరేగిపోతాను అంటుంది. అయితే వీళ్ల అసలు టార్గెట్.. కళ్యాణ్‌ని (Kalyan) ఇల్లరికం తీసుకుని పోవడమే అన్నట్లు గా తెలుస్తోంది. మంచి వాళ్లుగా నటిస్తూ కళ్యాణ్ ను అడ్డుపెట్టుకుని ఆస్తిని కాజేయాలని చూస్తున్నారు అనామిక తల్లిదండ్రులు.

Brahmamudi Serial Today Episode

ఇక రాజ్ ఫ్యామిలీలో ఎవరికి తెలియకుండా రూ. 2 కోట్లు అప్పు తీరుస్తాను అంటూ మాట ఇవ్వడంతో అనామిక తల్లిదండ్రులు రాజ్ ముందు మంచిగా నటిస్తారు. ఈ పెళ్లి జరగడానికి కారణం మీరే రాజ్ గారు.. మీరే సాయం చేయకుండా ఉండి ఉంటే.. అసలు పెళ్లి జరిగేదే కాదంటూ నటిస్తారు. ఇలా ఎలాగైనా ముందు రాజుతో తన 2 కోట్ల అప్పు తీర్చుకునేలా మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు అనామిక తండ్రి సుబ్బు.

publive-image

ఈ రోజు ఎపిసిడ్ లో కొత్త కోడలు అనామిక అందరికి కాఫీ ఇస్తుంది. ప్రతి రోజు కావ్య కాఫీ తాగి బోర్ కొట్టింది ఈ రోజు కొత్తగా కొత్త కోడలు కాఫీ తాగుతా అంటూ రాజ్ అంటాడు. ఇంట్లో అందరికి కాఫి ఇస్తుంది అనామిక. అయితే, ఆ కాఫి తాగిన కుటుంబ సభ్యలు అందరూ ఉలిక్కిపడుతారు.

Also Read: ఓటీటీలో హాయ్ నాన్న .. రిలీజ్ డేట్ వచ్చేసింది

Advertisment
తాజా కథనాలు