Brahmamudi Serial: అత్తను రఫ్ఫాడిస్తున్న స్వప్న.. అప్పుకు యాక్సిడెంట్..షాక్ లో కావ్య..!

బ్రహ్మముడి సీరియల్ లో అప్పుకు యాక్సిడెంట్ అయిందని కావ్యకు కనకం కాల్ చేసి చెబుతుంది. వెంటనే రాజ్ కు చెప్పి హాస్పిటల్ కు వెళ్తుంది కావ్య. దీంతో పూజ ఆగిపోతుంది. కావ్యను ధాన్యలక్ష్మి, రుద్రాణి, అనామిక నానా మాటలు అంటారు.

New Update
Brahmamudi Serial: అత్తను రఫ్ఫాడిస్తున్న స్వప్న.. అప్పుకు యాక్సిడెంట్..షాక్ లో కావ్య..!

Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్‌ ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజకు అందరూ రెడీ అవుతుంటారు. అప్పుకు (Appu) యాక్సిడెంట్ అని కావ్యకు (Kavya) ఫోన్ వస్తుంది. మరోవైపు అత్త రుద్రాణిని కోడలు బాగా టార్చార్ చేస్తుంది. కావ్య పూజకు రాకపోవడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఇలా, ఈ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది.

అప్పుకు యాక్సిడెంట్

కావ్యకు వాళ్ల అమ్మ కనకం నుండి ఫోన్ కాల్ వస్తుంది. అప్పుకు యాక్సిడెంట్ అయిందని ఏడుస్తూ చెబుతుంది. నేను హాస్పిటల్ కు వెళ్తాను.. మీరు ఇంట్లోనే ఉండి పూజ చేయించండి.. ఈ విషయం తెలుస్తే అందరూ బాధపడుతారు.. ఎవరికి చెప్పకండి.. అంటూ భర్త రాజ్ (Raj) కు చెప్పి ఇంట్లో నుండి వెళ్లిపోతుంది.

publive-image

అత్తను ఓ ఆట ఆడుకుంటున్న కోడలు

అత్త అని రుద్రాణిని గట్టిగా అరుస్తుంది స్వప్న . వెంటనే రాహుల్, రుద్రాణి పరుగెత్తుకుని వచ్చి ఏమైంది అలా అరిచావ్ అంటారు. నాకు చీర కుచ్చిళ్లు సెట్ కావట్లేదు.. సెట్ చేయండి అని అంటుంది. ఏంటే నీ కాళ్ల దగ్గర కూర్చుని నీకు కుచ్చిళ్లు సెట్ చేయాలా? అని రుద్రాణి అంటుంది. స్వప్న బెదిరించడంతో కుచ్చిళ్లు సెట్ చేస్తుంది. ఇలా రోజుకో విధంగా తన అత్త రుద్రాణిని కోడలు స్వప్న రఫ్ఫాడిస్తుంది.

publive-image

షాక్ అయిన కుటుంబ సభ్యులు

ఇంట్లో పెద్ద వాళ్లందరూ పూజకు వస్తారు. కళ్యాణ్, అనామిక, స్వప్న, రాహుల్ పూజకు కూర్చుంటారు. రాజ్ మాత్రం రూమ్ నుండి ఒక్కడే వస్తాడు..కావ్య ఎక్కడా? ఇంకా రాలేదు అని అడుగుతారు. కావ్య బయటికి వెళ్లింది అని చెబుతాడు. దీంతో కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు. ఇంట్లో పూజ పెట్టుకుని ఇప్పుడు బయటికి వెళ్లడం ఏంటి? అని అడుగుతారు. ధాన్యలక్ష్మీ, రుద్రాణి, అనామిక వీరందరూ కలిసి కావ్య కావాలనే ఇంట్లో నుండి వెళ్లిపోయిందని నానా మాటలు అంటారు. తను లేకున్న పర్వాలేదు పూజ జరిపించండి అని అంటుంది ధాన్యలక్ష్మీ. దీంతో అపర్ణ తనను తిడుతుంది.

Brahmamudi Serial Today Episode

కావ్యను వెనుకేసుకొచ్చిన అపర్ణ

నీ కొడుకు కోడలు పూజ చేస్తే చాలా..నా కొడుకు కూర్చోకుడదా? నీ కొడుకు పెళ్లి అయ్యాక నీకు స్వర్థం ఎక్కువ అయిందని ధాన్యలక్ష్మీ ని అంటుంది. ఏది ఏమైనా కావ్య పూజ చేయాల్సిందేనంటూ రాజ్ నాన్నమ్మ చెబుతుంది. కావ్య కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు. దీంతో అనామిక లేచి వెళ్లిపోతుంటుంది. ఇంట్లో అందరూ తనను ఆపుతారు. అనామిక ఏమో కావ్య కు ఈ వత్రం చేయడం ఇష్టం లేదని అందుకే వెళ్లిపోయిందని అంటుంది. మా వదిన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావని కళ్యాణ్ అంటాడు.

Brahmamudi Serial Today Episode

సీరియస్ కండీషన్ లో అప్పు

హాస్పిటల్ కు వెళ్లిన కావ్య అప్పును చూసి భాద పడుతుంటుంది. తన అమ్మ నాన్నకు ధైర్యం చెబుతుంది. డాక్టర్ ను కలిసి అప్పు పరిస్థితి గురించి అడిగితే తనకి బ్లడ్ అవసరం అని చెబుతుంది. తనది రేర్ బ్లడ్ గ్రూప్ అని.. హాస్పిటల్ లో కూడా ఆ బ్లడ్ లేదని చెబుతుంది. కనకం కావ్యతో మాట్లాడుతూ..అల్లుడికి కాల్ చేసి పరిస్థితి గురించి చెప్పుమా..తను తప్ప ఎవరూ మనల్ని ఆదుకోరని అంటుంది.

Also Read:వ్యూహం సినిమాపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు