Vijayawada: విజయవాడ వేదికగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ( Dr. BR Ambedkar) 125 విగ్రహావిష్కరణ (Invention of the statue) కార్యక్రమం ఈ రోజు అట్టహాసంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా భావించిన అంబేద్కర్ విగ్రహాన్ని స్వరాజ్ మైదాన్ (Swaraj Maidan) లో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) తన చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా. ఇక నుంచి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇండియాలో విజయవాడ పేరు మారుమ్రోగుతుంది' అన్నారు.
దాదాపు 01.20 లక్షల మంది సమక్షంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగావి జరగగా.. స్మృతి వనం ప్రారంభోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు విజయవాడకు తండోపతండాలుగా తరలివచ్చారు.
ఇదిలావుంటే.. రాష్ట్రంలో ఎస్సీల పై దారుణంగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకోవడానికి కూడా అర్హత లేదని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు అన్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
అంతేకాకుండా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని అభినవ అంబేద్కర్ గా అభినవ భగీరథుడుగా మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యేల మంత్రుల నాలుకలు కోయాలంటూ ఘాటుగా స్పందించారు.
ఎస్సీ మహిళలపై వైసీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా అఘాయిత్యాలు దాడులు పాల్పడుతున్నారు. అక్రమ కేసులతో దారుణంగా వ్యవహరిస్తే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు.
అలాగే పక్క రాష్ట్రంలో అఘాయిత్యం చేసిన వారిని ఎన్కౌంటర్ చేస్తే మెచ్చుకున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎస్సీ మహిళలపై దాడులు చేసిన వారిపై ఎలాంటి చర్యలు లేవని, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పాల్పడినా పట్టించుకోలేదన్నారు.
ఇది కూడా చదవండి : AP: జనసేన జోనల్ కమిటీలు ఏర్పాటు.. ఎవరెవరున్నారంటే!
ఇలాంటి వ్యక్తి ఈరోజు అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది కేవలం ఎన్నికల్లో మరొకసారి లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే అన్నారు.
అయితే జగన్ ను ఎస్సీలు అందరూ అర్థం చేసుకున్నారని, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటుతో తగిన బుద్ధి చెప్పేలా వ్యవహరించడానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారని ఎమ్మెస్ రాజు అభిప్రాయపడ్డారు.