Nikhat Zareen Emotional Post : పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో పక్కా పతకం సాధిస్తుందనుకున్న స్టార్ బాక్సర్ , తెలంగాణ (Telangana) యువతి నిఖత్ జరిన్ ఖాళీ చేతులతోనే రాష్ట్రానికి తిరిగి వచ్చింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన నిఖత్ (Nikhat Zareen) ఒలింపిక్ మహాసంగ్రామంలో తన పంచ్ పవర్ చూపించలేకపోయింది. ఊహించని రీతిలో తొలిరౌండ్ లోనే ఇంటి ముఖం పట్టింది. ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలిచిన ఇందూరు ముద్దు బిడ్డ ఒలింపిక్ పతకాన్ని ముద్దాడలేకపోయింది.
పూర్తిగా చదవండి..Nikhat Zareen : బాక్సింగ్ కే జీవితం అంకితమిచ్చా.. ఓటమి తట్టుకోలేకపోతున్నాను!
ఒలింపిక్స్ లో పతకం కచ్చితంగా సాధిస్తుందనుకున్నతెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ ఊహించని రీతిలో మొదటి రౌండ్ లోనే వెనుదిరిగింది.ఈ క్రమంలో ఆమె తన బాధను ఎక్స్ ద్వారా పంచుకుంది. జీవితం మొత్తాన్ని బాక్సింగ్ కే కేటాయించాను. ఈ ఓటమి ఫలితాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందంటూ రాసుకొచ్చింది.
Translate this News: