బిల్డప్ వద్దు..టోఫెల్ లో 4500 కోట్ల స్కాం నిరూపించండి..!! విద్యా వ్యవస్థలో స్కాంలు జరుగుతున్నాయని జనసేన ఆరోపించడంపై మంత్రి బొత్స స్పందించారు. టోఫెల్ విద్యా విధానంపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్దేశ్యం తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు ఇస్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. టోఫెల్ లో 4500 కోట్లు స్కాం అని నాదెండ్ల మనోహర్ అంటున్నారని..ఇందులో స్కాం ఎక్కడ ఉందో మనోహర్ చూపించాలని డిమాండ్ చేశారు మంత్రి బొత్స. By Jyoshna Sappogula 20 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Botsa Satyanarayana: విద్యా వ్యవస్థలో స్కాంలు జరుగుతున్నాయని..జగన్ ప్రభుత్వం వచ్చాక విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అమ్మఒడిలో స్కాం జరిగిందన్నారు. ఈటీఎస్, ఐబీ ఒప్పందాల వెనుక భారీ స్కాం ఉందనే అనుమానాలున్నయన్నారు జనసేనాని . మూడో తరగతి పిల్లలకు టోఫెల్ శిక్షణ ఎందుకో అర్థం కావడం లేదని విమర్శలు గుప్పించారు. కాగా, ఈ ఆరోపణలపై మంత్రి బొత్స స్పందించారు. Also read: విద్యా వ్యవస్థ స్కాంలే టార్గెట్.. అధికారంలోకి వస్తే ఫస్ట్ చేసేది ఇదే..!! జగన్ ప్రభుత్వంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రైవేటు స్కూల్స్ మాదిరిగానే ప్రభుత్వ స్కూల్స్ లో విద్యను అందిస్తున్నమన్నారు. టోఫెల్ విద్యా విధానం పై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని పవన్ పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఉద్దేశ్యం తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు ఇస్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. టోఫెల్ లో 4500 కోట్లు స్కాం అని నాదెండ్ల మనోహర్ అంటున్నారని..ఇందులో స్కాం ఎక్కడ ఉందో మనోహర్ చూపించాలని డిమాండ్ చేశారు. మనోహర్ పెద్ద మేధావి లా.. ఏదో పట్టుకున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడని విమర్శలు గుప్పించారు మంత్రి బొత్స సత్యనారాయణ. పేదవాడికి మంచి విద్య అందించడం జనసేన పార్టీకి ఇష్టం ఉందా లేదా..? అంటూ మండిపడ్డారు. పేద పిల్లలకు మంచి విద్య ఇస్తుంటే మీకెందుకు ఈర్ష్య..? అంటూ ఫైర్ అయ్యారు. విదేశీ విద్య పై గ్రిప్ రావాలని టోఫెల్ విధానం తీసుకుని రావడం మా ప్రభుత్వం చేసిన తప్పా..? అంటూ ప్రశ్నించారు. టోఫెల్ లో ఒక్కో విద్యార్థికి 7.5 రూపాయిలు మాత్రమే ప్రభుత్వం కర్చు చేస్తుందని వెల్లడించారు. ప్రజలకి మంచి జరిగేదే జగన్ ప్రభుత్వం చేస్తుందని.. ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదని జనసేన పార్టీ నేతలపై ధ్వజమెత్తారు. #janasena-leader-nadendla-manohar #botsa-satyanarayana #janasena-pawan-kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి