Borra Caves: నేటి నుంచి మూతపడనున్న బొర్రా గుహలు..ఎందుకో తెలుసా!

పర్యాటక ప్రదేశం అయిన బొర్రా గుహలు శనివారం నుంచి మూతపడనున్నాయి. వేతనాల పెంపు విషయం గురించి అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మెకు దిగారు.

New Update
Borra Caves: నేటి నుంచి మూతపడనున్న బొర్రా గుహలు..ఎందుకో తెలుసా!

Borra Caves: ఏపీ లో అరకు(Araku) వెళ్లాలనుకునే వారు కచ్చితంగా సందర్శించే ప్రదేశం బొర్రా గుహలు (Borra Caves). ఇవి సుమారు 150 మిలియన్‌ సంవత్సరాల కిందటే సహజంగా ఏర్పడ్డాయి. ఇవి వైజాగ్‌ కి 90 కి.మీల దూరంలో ఉన్న అనంతగిరిలో ఉన్నాయి. వీటిని చూడటానికి నిత్యం ఎంతో మంది వస్తుంటారు. అయితే వీటిని చూసేందుకు వెళ్లాలనుకునే టూరిస్టులకు ఓ బ్యాడ్‌ న్యూస్‌.

ఏపీ టూరిజం కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా బొర్రా గుహలు శనివారం నుంచి మూతపడనున్నాయి. గత 6 సంవత్సరాలుగా పెండింగ్‌ లో ఉన్న తమ డిమాండ్లను తీర్చాలంటూ కార్మికులు అధికారులకు నోటీసులు ఇచ్చారు. ఈ విషయం గురించి అధికారులు కార్మికులతో ముందుగా చర్చలు జరిపారు. కానీ అవి విఫలం కావడంతో కార్మికులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.

Also read: టపాసుల ధరల పేలిపోతున్నాయా? హైదరాబాద్‌లో అక్కడ చాలా చీప్ బాసూ!

ఈ సమ్మెలో బొర్రా గుహలు, అనంతగిరి హిల్‌ రిసార్ట్స్‌ , అరకులోయ లోని హరిత వ్యాలీ, మయూరి హిల్‌ రిసార్టులు, లంబసింగి రిసార్టులో పని చేస్తున్న కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో బొర్రా గుహలతో పాటు పర్యాటక ప్రాంతాలు, టూరిజం శాఖ అతిథి గృహాలు కూడా మూత పడనున్నాయి.

Borra Caves

దీంతో బొర్రా గుహలు చూడటానికి ముందుగా టికెట్లు బుక్‌ చేసుకున్న వారంతా కూడా టెన్షన్‌ పడుతున్నారు. 2010 అక్టోబర్‌ లో టూరిజం కార్మికులు సమ్మెకు పిలుపు ఇవ్వడంతో ఏపీటీడీసీ అప్పటి సీఎండీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనాఖాన్‌ స్పందించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే వరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించేందుకు గ్యాట్యూటి పదోన్నతులు ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు.

వీటిని 2017 వరకు కూడా అమలు చేశారు. అనంతరం '' సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా కన్సాలిడేషన్‌ పేగా మార్పు చేశారు. దీంతో కార్మికుల వేతనాలు తగ్గిపోయాయి. గతంలో ఉన్న ఒప్పందాలనే కొనసాగించాలంటూ కార్మికులు పలుమార్లు ఏపీటీడీసీ ఉన్నతాధికారులను కోరినప్పటికీ ఫలితం లేకపోయింది.

Borra Caves

దీంతో గత్యంతరం లేక సమ్మెకు దిగాల్సి వచ్చిందని టూరిజం కాంట్రాక్టు, మేన్‌ పవర్‌, డైలీ వేజ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దీసరి గంగరాజు, అల్లూరి జిల్లా అధ్యక్షుడు ఆర్వీ నరసింహ, కార్యదర్శి అంజలీరావు టోకూరు సర్పంచ్‌ మొష్యా తదితరులు చెప్పారు. కానీ టూరిజం అధికారుల మాటలు నమ్మలేమని, తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మే చేస్తామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేసి సమావేశం నుంచి బయటకు వచ్చారు.

దీంతో శనివారం నుంచి తైడా జంగిల్‌ బెల్స్‌, బొర్రా గుహలు, అనంతగిరి హిల్‌ రిసార్ట్స్‌, అరకులోయలోని హరిత వ్యాలీ, మయూరి హిల్‌ రిసార్టులు, లంబసింగి రిసార్టులో పనిచేస్తున్న కార్మికులు సమ్మె చేయనున్నారు.

Advertisment
తాజా కథనాలు