Hyderabad: నగరంలో తాగునీటికి కటకట... రోజుకి 6 వేలకు పైగా ట్యాంకర్ల బుకింగ్!

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరంలో మంచి నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు.ఇంకా వేసవి పూర్తిగా రాకముందే పరిస్థితులు ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.గత కొన్నిసంవత్సరాలుగా కనుమరుగైన ట్యాంకర్ల పరంపర మళ్లీ మొదలైంది.

Hyderabad: నగరంలో తాగునీటికి కటకట... రోజుకి 6 వేలకు పైగా ట్యాంకర్ల బుకింగ్!
New Update

Drinking Water Crisis In Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరంలో మంచి నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంకా వేసవి (Summer)పూర్తిగా రాకముందే పరిస్థితులు ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. నగరంలో ఏ పక్కన చూసిన నీటి కటకట కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా కనుమరుగైన ట్యాంకర్ల పరంపర మళ్లీ మొదలైంది.

అంతేకాకుండా బిందెలతో ఫైటింగ్‌ లు మళ్లీ మొదలు అయ్యాయి. వేసవి ఇంకా పూర్తి కాకముందే రోజుకు 6500 కు పైగా నీటి ట్యాంకర్లు (Water Tanks) బుక్ అవుతున్నట్లు సమాచారం. కొత్తగా నీటి వనరులు లేకపోవడం, అదనపు నీటి జలాల తరలింపులు , జలమండలి అధికారుల రోజూ నగరంలోని వివిధ ప్రాంతాలకు ఐదు నీటి వనరుల ద్వారా 559. 81 ఎంజీడీలకు నీటిని అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: తగ్గేదేలే..పుష్ప 2 టీజర్ అదిరింది!

నగరంలో ప్రజలు పొదుపుగా వాడుతున్నప్పటికీ నీటి అవసరాలు తీరడం లేదు. ఇటువంటి పరిస్థితులు వస్తాయని కలలో కూడా అనుకోలేదని ప్రజలు చెబుతున్నారు. అధికారులు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ అవి సరిపోక ప్రైవేట్ ట్యాంకర్ల పై ఆధారపడుతున్నారు. దీంతో రోజుకి 6500 లకు పైగా ట్యాంకర్లు బుక్‌ అవుతున్నాయంటే నీటి ఎద్దడి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దీంతో అందివచ్చిన అవకాశాన్ని వ్యాపారులు అందిపుచ్చుకుంటున్నారు. అందినకాడికి దోచుకుతింటున్నారు. మాములు కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

#telangana #water #problem #demand #tankers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe