Boney Kapoor - Sridevi: పెళ్లికి ముందే శ్రీదేవి గర్భవతి.. సంచలన విషయాలు రివీల్ చేసిన బోనీకపూర్..

జూన్ 2న షిర్డీలో శ్రీదేవితో నా వివాహం జరిగింది. ఆ రాత్రి అక్కడే గడిపాము. జనవరి 1997లో, ఆమె గర్భవతిగా నిర్ధారణ అయ్యింది. ఇక మా వివాహ బంధాన్ని బహిర్గతం చేయడం తప్ప మాకు వేరే మార్గం కనిపించలేదు. పబ్లిక్‌గా మేము జనవరి 1997లో వివాహం చేసుకున్నాం. శ్రీదేవి పెళ్లికి ముందే గర్భవతి అని, ఆమె మొదటి గర్భం ద్వారా జన్మించన వ్యక్తి జాన్వి అని చాలా మీడియా సంస్థలు రాసుకుంటాయి. కానీ, వాస్తవం ఇది.' అని బోనీ కపూర్ వెల్లడించారు.

New Update
Boney Kapoor - Sridevi: పెళ్లికి ముందే శ్రీదేవి గర్భవతి.. సంచలన విషయాలు రివీల్ చేసిన బోనీకపూర్..

Boney Kapoor - Sridevi: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్(Boney Kapoor) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవకన్యగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నటి శ్రీదేవి(Sridevi) భర్తగా, మూవీ ప్రొడ్యూసర్‌గా సినీ ప్రేక్షక లోకానంతటికీ ఆయన సుపరిచితమే. 24 ఫిబ్రవరి, 2018లో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు శ్రీదేవి. ఈ లోకంలో ఆమె లేకపోయినప్పటికీ.. అభిమానుల మనసులో చిరకాలం నిలిచే ఉంటారు. తాజాగా బోనీకపూర్ తన భార్య శ్రీదేవి గురించి చాలా ఇంట్రస్టింగ్ విశేషాలు వెల్లడించారు. ఆయన మృతికి సంబంధించిన వివరాలు మొదలు.. తమ పెళ్లి, పిల్లలు సహా అనేక వివరాలను మీడియాతో పంచుకున్నారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్.. తమ రహస్య పెళ్లి, ఆ పెళ్లికి ముందే శ్రేదేవి గర్భవతి కావడానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.

1996లో శ్రీదేవి, బోనీ కపూర్ రహస్య వివాహం చేసుకున్నారు. షిర్డీలో వీరి వివాహం జరుగగా.. పెళ్లికి ముందు శ్రీదేవి గర్భవతి అయ్యింది. ఇదే విషయంపై మీడియా ప్రతినిథి ప్రశ్నించగా.. కీలక వివరాలు చెప్పాఆరు. వాస్తవానికి బోనీ కపూర్‌కు 1983లో మోనా శౌరితో మొదటి వివాహం జరిగింది. అప్పటికీ శ్రీదేవితో బోనీ కపూర్ ప్రేమ వ్యవహారం నడుపుతున్నారు. ఈ విషయంలో తన భార్యతో చాలా నిజాయితీ ఉన్నానని చెప్పుకొచ్చారు బోనీ కపూర్. ఈ క్రమంలో 1996 జూన్ 2న షిర్డీలో శ్రీదేవిని తాను రహస్యంగా వివాహం చేసుకున్నానని తెలిపారు. అయితే, శ్రీదేవి గర్భం దాల్చిన నెల రోజుల తరువాత ఈ పెళ్లి విషయాన్ని ప్రకటించానన్నారు.

ఇదికూడా చదవండి: PM Modi vs CM KCR: కేసీఆర్ గురించి సంచలన విషయాలు రివీల్ చేసిన ప్రధాని మోదీ..

'జూన్ 2న షిర్డీలో శ్రీదేవితో నా వివాహం జరిగింది. ఆ రాత్రి అక్కడే గడిపాము. జనవరి 1997లో, ఆమె గర్భవతిగా నిర్ధారణ అయ్యింది. ఇక మా వివాహ బంధాన్ని బహిర్గతం చేయడం తప్ప మాకు వేరే మార్గం కనిపించలేదు. పబ్లిక్‌గా మేము జనవరి 1997లో వివాహం చేసుకున్నాం. శ్రీదేవి పెళ్లికి ముందే గర్భవతి అని, ఆమె మొదటి గర్భం ద్వారా జన్మించన వ్యక్తి జాన్వి అని చాలా మీడియా సంస్థలు రాసుకుంటాయి. కానీ, వాస్తవం ఇది.' అని బోనీ కపూర్ వెల్లడించారు.

'ఆమె నా బలం, ఆమె నా లైఫ్ లైన్, ఆమె నా ఆలోచనల్లో ఎప్పుడూ ఉంటుంది. నాకు చాలా అవసరమైనప్పుడు, తన కుమార్తెల విజయాన్ని చూడాలని కోరుకున్నప్పుడు, ఆమె ఇంత త్వరగా వెళ్ళడం చాలా బాధాకరం. నేను ప్రాంతీయ సినిమాలు చేయడం ఆమె చూడాలని కోరుకున్నారు. నేను స్థానిక సినిమాలు చేయాలనేది శ్రీదేవి ఆలోచన. నేను ఆమె కలలన్నింటినీ నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నాన్ని అలాగే కొనసాగిస్తాను.' అని చెప్పుకొచ్చారు.

'నేను శక్తివంతమైన కుటుంబ వ్యక్తిని కాదు, సాధారణ కుటుంబ మనిషిని. శ్రద్ధగల, ప్రేమగల కొడుకుని, సోదరుడుని, నా భార్యకు భర్తను, నా పిల్లలు అర్జున్, అన్షులా, జాన్వీ, ఖుషీ లకు తండ్రిని. నా మొదటి భార్య మోనాతో కూడా పూర్తిగా నిజాయితీగా ఉన్నాను. సింపుల్‌గా చెప్పాలంటే.. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల నిజాయితీగా ఉండే సాధారణ, నిజాయితీ గల వ్యక్తిని నేను. నేను చేయగలిగిన కాడికి చేస్తారు. నా కుటుంబ సభ్యులు లేకుండా నేనేమీ చేయలేదు.' అని చెప్పుకొచ్చారు.

ఇదికూడా చదవండి: PM Modi vs CM KCR: కేసీఆర్ గురించి సంచలన విషయాలు రివీల్ చేసిన ప్రధాని మోదీ..

Advertisment
Advertisment
తాజా కథనాలు