ఆత్మగౌరవానికి విరుద్ధంగా ప్రవర్తించలేను...బాంబే హైకోర్టు జడ్జి రోహిత్ డియో రాజీనామా...!!

బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో శుక్రవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. న్యాయవాదుల సమక్షంలో కోర్టు హాలులోనే జస్టిస్ రోహిత్ డియో ఈ ప్రకటన చేశారు.

author-image
By Bhoomi
ఆత్మగౌరవానికి విరుద్ధంగా ప్రవర్తించలేను...బాంబే హైకోర్టు జడ్జి రోహిత్ డియో రాజీనామా...!!
New Update

Justice Rohit Deo: బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో తన వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.నాగ్‌పూర్ బెంచ్‌కు చెందిన జస్టిస్ డియో కోర్టు హాలులో ఈ ప్రకటన చేసినట్లు ఆ సమయంలో అక్కడే ఉన్న న్యాయవాది తెలిపారు. ఆత్మగౌరవానిి విరుద్ధంగా ప్రవర్తించలేనని జస్టిస్ రోహిత్ డియో చెప్పినట్లు న్యాయవాది వెల్లడించారు.

కోర్టులో ఉన్నవారందర్నీ ఉద్దేశించి క్షమాపణలు కోరారు జస్టిస్ రోహిత్ డియో(Justice Rohit Deo). మీపై చాలా సార్లు ఆగ్రహం వ్యక్తం చేశాను..అయితే బాధపెట్టాలని ఆ విధంగా చేయలేదని..మీరు మరింత మెరుగపడాలని మాత్రమే అలా అన్నానని చెప్పారు. తాను తన పదవికి రాజీమానా చేశానని, తన ఆత్మగౌరవానికి విరుద్ధంగా పనిచేయలేనని, మీరంతా కష్టపడి పనిచేయాలని జస్టిస్ రోహిత్ డియో చెప్పారు.

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో అరెస్టు అయిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను జస్టిస్ రోహిత్ డియో గతేడాది నిర్దోషిగా ప్రకటించారు. సాయిబాబాకు విధించిన జీవిత ఖైదును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఈ తీర్పుపై స్టే విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద నేరాలు విచారణ ప్రక్రియ శూన్యమంటూ పేర్కొన్నారు. అయితే, సుప్రీం కోర్టు ఈ ఉత్తర్వుపై స్టే విధించింది. ఈ వ్యాజ్యాన్ని మళ్లీ విచారించాలని హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌ని ఆదేశించింది. నాగ్‌పూర్-ముంబై సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సంబంధించి జనవరి 3న మహారాష్ట్ర సర్కార్ చేసిన తీర్మానంపై కూడా జస్టిస్ రోహిత్ డియో గతవారం స్టే విధించిన సంగతి తెలిసిందే.

2016 వరకు మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన రోహిత్ డియో, 2017లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. డిసెంబర్ 2025లో పదవీకాలం ముగుస్తుంది. కానీ రెండు సంవత్సరాల ముందే తన పదవికి రాజీనామా చేశారు.

#justice-rohit-deo-resigned #bombay-high-court-justice-rohit-deo-resigned #judge-resigns #justice-rohit-deo #bombay-hc-resigns-in-open-court #bombay-high-court #maharashtra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి