National : ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట.. నిర్దోషి అని ప్రకటించిన బాంబే హైకోర్టు

మావోయిస్టుల సంబంధాలున్నాయంటూ అరెస్ట్ చేసిన ప్రొఫెసర్ సాయిబాబాకు ఎట్టకేలకు ఊరట లభించింది. బాంబే హైకోర్టు ఆయన నిర్దోషి అని ప్రకటించింది. 2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.

National : ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట.. నిర్దోషి అని ప్రకటించిన బాంబే హైకోర్టు
New Update

Professor Sai Baba : పదేళ్ళ తర్వాత ప్రోషెసర్ సాయిబాబా(Professor Sai Baba) కు జైలు నుంచి విముక్తి లభించింది. ఇన్నాళ్ళ తర్వాత బాంబే హైకోర్టు(Bombay High Court) ఆయనను నిర్దోషి అని ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ... 2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు(Maharashtra Police) అరెస్ట్ చేశారు. ఈ కేసులో 2017లో గడ్జిరౌలీ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. 2014 నుంచి ప్రొఫెసర్ సాయిబాబా నాగ్‌పూర్‌ జైల్లోనే ఉంటున్నారు.

Also Read : Andhra Pradesh: వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం గుడ్‌బై..

అప్పట్లో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని.. ఫ్రోఫెసర్ సాయిబాబాతో పాటు ఐదుగురిపై UAPA కేసులు పెట్టింది. ఇప్పుడు ఈ ఉపా కేసులన్నింటినీ నాగపూర్‌ ధర్మాసనం కొట్టివేసింది. ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

2014లో అరెస్ట్ అయ్యేనాటికి ప్రొఫెసనర్ సాయిబాబా ఢిల్లీ యూనివర్శిటీ(Delhi University) లో జాబ్ చేస్తున్నారు. కేసు నేపథ్యంలో 2014లోనే ఆయనను యూనివర్శిటీ నుంచి సస్పెండ్ చేశారు. 2021లో విధుల్లోంచి తొలగించారు. చిన్నప్పటి నుంచే 90 శాతం వైకల్యంతో సాయిబాబా బాధపడుతున్నారు. జైల్లో పెట్టిన తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. పలుసార్లు ఆయనకు వైద్యులు చికిత్స కూడా అందించారు. ఎట్టకేలకు సాయిబాబాకు జైలు నుంచి శాశ్వత విముక్తి అభించింది.

Also Read : Samantha : ఐకాన్‌ స్టార్‌ను తెగ పొగిడేస్తున్న సామ్.. మతలబేంటో తెలుసా!

#bombay-high-court #professor-sai-baba #moaists
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe