AIR INDIA: విమానంలో ‘బాంబ్‌’ నోట్ కలకలం.. వాష్‌రూంలో టిష్యూ పేపర్‌ పై..

ఢిల్లీ IGIAలో టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్‌’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్‌ లభ్యం కావడం కలకలం రేపుతోంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులందరినీ కిందికి దించేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

New Update
AIR INDIA: విమానంలో ‘బాంబ్‌’ నోట్ కలకలం.. వాష్‌రూంలో టిష్యూ పేపర్‌ పై..

AIR INDIA: టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్‌’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్‌ లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఢిల్లీ నుంచి గుజరాత్‌లోని వడోదరకు వెళ్లేందుకు ఎయిర్‌ ఇండియా విమానం సిద్ధమైంది. అయితే, అంతలోనే అందులోని వాష్‌రూంలో ‘బాంబ్‌’ అని రాసి ఉన్న ఓ టిష్యూ పేపర్‌ విమాన సిబ్బంది కంటపడింది.

Also Read: హైదరాబాద్‌ ICFAI యూనివర్సిటీలో దారుణం.. స్టూడెంట్‌ పై యాసిడ్ అటాక్‌..!

దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ప్రయాణికులందరినీ కిందికి దించేశారు. సీఐఎస్‌ఎఫ్‌ తోపాటు ఢిల్లీ పోలీసులకు సైతం సమాచారం అందించారు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, అనుమానాస్పద వస్తువులేవీ లభ్యం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో ప్రయాణికులను వడోదరాకు పంపించినట్లు సిబ్బంది వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు