Bad Newz Trailer: త్రిప్తి దిమ్రి- విక్కీ కౌశల్ 'బ్యాడ్ న్యూస్'.. ట్రెండింగ్ లో ట్రైలర్..!

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రి జంటగా నటించిన తాజా చిత్రం 'బ్యాడ్ న్యూస్'. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం జూలై 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫన్, డ్రామాతో కూడిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Bad Newz Trailer: త్రిప్తి దిమ్రి- విక్కీ కౌశల్ 'బ్యాడ్ న్యూస్'.. ట్రెండింగ్ లో ట్రైలర్..!
New Update

Bad Newz Trailer: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి, అమ్మీ విర్క్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'బ్యాడ్ న్యూస్'. డ్రామా, కామెడీ, లవ్, ఎమోషన్ ఇలా ప్రతీ ఎమోషన్ కలిగిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ఆనంద్ తివారీ దర్శకత్వం వహించగా.. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై హీరో యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అమృతపాల్ సింగ్ బింద్రా సంయుక్తంగా నిర్మించారు. నిజజీవిత సంఘటనల స్ఫూర్తితో రూపొందించిన అరుదైన హాస్య చిత్రం ఇది.

publive-image

'బ్యాడ్ న్యూస్' ట్రైలర్

ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫుల్ కామెడీ, డ్రామా, ఎమోషన్స్ తో సాగిన ఈ ట్రైలర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ తో టాప్ 6 ట్రెండింగ్ గా దూసుకెళ్తోంది. పాపులర్‌ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ పోస్ట్‌ థ్రియాట్రికల్ రైట్స్‌ను కొనుగోలు చేసింది.

Also Read: Ambani Wedding: అనంత్, రాధికల పెళ్ళికి ముందు.. ముఖేష్- నీతా అంబానీల ప్రత్యేక కార్యక్రమం..? - Rtvlive.com

#triptii-dimri #vicky-kaushal #bad-newz-trailer
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe