Bad Newz OTT: ఓటీటీలో 'బ్యాడ్ న్యూస్' మూవీ.. కానీ చూడాలంటే ఒక ట్విస్ట్..!

త్రిప్తి దిమ్రి, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం 'బ్యాడ్ న్యూస్'. జులై 19న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో రెంటల్‌ బేసిస్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రూ. 349 చెల్లించి ఈ మూవీని చూడవచ్చు.

New Update
Bad Newz OTT: ఓటీటీలో 'బ్యాడ్ న్యూస్' మూవీ.. కానీ చూడాలంటే ఒక ట్విస్ట్..!

Bad Newz OTT: యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి, విక్కీ కౌశల్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'బ్యాడ్ న్యూస్'. ఆనంద్ తివారీ దర్శకత్వంలో జులై 19న థియేటర్స్ లో గ్రాండ్ విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. విడుదలైన అతి కొద్ది రోజుల్లోనే 100 కోట్ల మార్క్ దాటేసి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది.

రెంటల్ పద్దతిలో 'బ్యాడ్ న్యూస్ '

ఈ సినిమాను కేవలం రెంటల్ బేసిస్ లో మాత్రమే వీక్షించే అవకాశం కల్పించారు. మిగతా చిత్రాల వలే సాధారణ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా ఈ చిత్రాన్ని చూడలేము. రెంటల్ పద్దతిలో మాత్రమే చూసే వీలుంటుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో రూ. 349కు ఈ సినిమా అందుబాటులో ఉంది. రెంటల్ పద్ధతిలో.. నిర్ణిత సమయం లోపే సినిమాను చూసే అవకాశం ఉంటుంది. రెంటల్ డేట్ ముగిసిన తర్వాత మూవీ అందుబాటులో ఉండదు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పై కరణ్ జోహార్ నిర్మించారు. నేహా ధూపియా, షీబా చద్దా, గజరాజ్ రావు, ఫైసల్ రషీద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో విక్కీ, త్రిప్తి ప్రదర్శన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Also Read: Jayasurya: జయసూర్య లైంగిక ఆరోపణలు.. రెండో కేసు నమోదు..! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు