/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-23-1-jpg.webp)
Varun Dhawan to Become Father: వరుణ్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది జాన్వీ కపూర్, వరుణ్ జంటగా నటించిన బవాల్ చిత్రంతో (Bawaal Movie) సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నారు. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ యంగ్ హీరో తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.
గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్ ధావన్
వరుణ్ ధావన్ త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. తన వైఫ్ బేబీ బంప్ పై (Baby Bump) ముద్దు పెడుతున్న ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మేము పేరెంట్స్ కాబోతున్నాము.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు మా పై ఉండాలి అంటూ రాసుకొచ్చారు. వరుణ్ పెట్టిన ఈ పోస్ట్ నిమిషాల్లో లక్షల లైక్స్, వేల కామెంట్స్ తో ఫుల్ వైరలవుతుంది. అభిమానుల నుంచి సినీ సెలెబ్రెటీల వరకు వరుణ్-నటాషాలకి (Varun-Natasha Dawal) కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. కరణ్ జోహార్, అలియా భట్, సమంతా, కియారా అద్వానీ, పరిణీతి చోప్రా, కృతి సనన్, రాశి ఖన్నా, అర్జున్ కపూర్, వాణి కపూర్, నుపుర్ సనన్ ఈ జంటకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఇక సమంత "ఓ మై గాడ్" బెస్ట్ న్యూస్ అంటూ కామెంట్ పెట్టింది.
Also Read: ‘శీలావతిగా’.. అనుష్క.. 14 ఏళ్ళ తర్వాత మరో సారి క్రిష్, అనుష్క కాంబో రిపీట్
View this post on Instagram
ప్రస్తుతం వరుణ్ సమంత సరసన సిటాడెల్ వెబ్ సీరీస్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు యాక్షన్ ఎంటర్ టైనర్ 'బేబీ జాన్'లో కనిపించబోతున్నారు. తమిళ్ మూవీ 'థెరి' సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. కాళేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Operation Valentine Trailer: “ఏం జరిగిన చూస్కుందాం” .. ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్