/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-39-7.jpg)
Bollywood Senior Actor Sanjay Dutt : 'KGF' మూవీతో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్.. ఆ సినిమాలో విలన్ గా భయపెట్టాడు. ఆ తర్వాత తలపతి విజయ్ నటించిన 'లియో' సినిమాలో మరోసారి విలన్ రోల్ తో మెప్పించారు. ప్రస్తుతం సౌత్ పై ఫుల్ ఫోకస్ పెడుతూ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సంజయ్ దత్ తాజాగా తన 65వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా తనే స్వయంగా రూ.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు . ఈ ఖరీదైన కారును కొనుగోలు చేయడంతో సంజయ్ దత్ లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు మరోసారి నిదర్శనం అయ్యారు. ఇప్పటికే అయన గ్యారేజిలో కొన్ని లగ్జరీ కార్లు ఉండగా.. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో కారు వచ్చి చేరింది. సంజయ్ దత్ కొత్త కారు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : ప్లీజ్, పవన్ కళ్యాణ్ తో ఒక్క ఫోటో ఇప్పించు .. నిహారికని బతిమాలుకున్న హీరోయిన్..!
#WATCH | Sanjay Dutt Gifts Himself New Range Rover On His 65th Birthday#Bollywood #SanjayDutt @duttsanjay pic.twitter.com/vIhiFbkpV2
— Free Press Journal (@fpjindia) July 29, 2024
ఇక సంజయ్ దత్ సినిమాల విషయానికొస్తే.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ 'డబుల్ ఇస్మార్ట్' లో విలన్ రోల్ చేశారు. ఇందులో ఆయన బిగ్ బుల్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ లో ఆయన లుక్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఆగస్టు 15న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.