'యానిమల్' నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం.. 20 ఏళ్లకే కన్నుమూసిన కూతురు! బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత క్రిషన్ కుమార్ కుమార్తె తిషా (20) అనారోగ్యంతో కన్నుమూసింది. ఈ విషయాన్ని టీ సిరీస్ అధికారికంగా తెలియజేసింది. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో పోరాడుతున్నారని.. చికిత్స పొందుతూ జర్మనీలోని ఓ ఆస్పత్రిలో మృతి చెందినట్లు సమాచారం. By Anil Kumar 19 Jul 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bollywood Producer Krishan Kumar's Daughter Passed Away : బాలీవుడ్ (Bollywood) సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత క్రిషన్ కుమార్ (Krishan Kumar) కుమార్తె తిషా (20) అనారోగ్యంతో కన్నుమూసింది. ఈ విషయాన్ని టీ సిరీస్ నిర్మాణ సంస్థ అధికారికంగా తెలియజేసింది." అనారోగ్యంతో సుదీర్ఘ పోరాటం తర్వాత తిషా మరణించింది. మా కుటుంబానికి ఇది క్లిష్ట సమయం. కాబట్టి, దయచేసి మా గోప్యతను గౌరవించాలని మేము కోరుతున్నాం" అంటూ పేర్కొంది. Also Read : తమన్నా డ్యాన్స్ పై నెగిటివ్ కామెంట్స్.. క్షమాపణ చెప్పిన సీనియర్ నటుడు! టీ సిరీస్ (T-Series) వ్యవస్థాపకుల్లో ఒకరైన గుల్షన్ కుమార్ సోదరుడే ఈ క్రిషన్ కుమార్. ఆయన పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తమ సంస్థలో నిర్మితమైన పలు చిత్రాల ప్రీమియర్స్‌కు క్రిషన్ కుమార్ కూతురు తిషా గతంలో హాజరయ్యారు. గతేడాది విడుదలైన ‘యానిమల్’ ప్రీమియర్ షోలో భాగంగా చివరిసారి ఆమె కెమెరా ముందు కనిపించారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో పోరాడుతున్నారని.. చికిత్స పొందుతూ జర్మనీ (Germany) లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారని పలు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. #bollywood #tisha #animal-producer #producer-krishan-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి