Sreeleela : బాలీవుడ్ ఆఫర్ ను శ్రీలీల రిజెక్ట్ చేసిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత

శ్రీలీలకు రీసెంట్ గా ఓ బాలీవుడ్ ఆఫర్ ను తిరస్కరించిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ నిర్మాత స్పందించారు. ఈ మేరకు నిర్మాత క్లారిటీ ఇస్తూ.. అది పూర్తిగా అవాస్తవమని, సినిమాలో పాత్ర కోసం ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.

New Update
Sreeleela : బాలీవుడ్ ఆఫర్ ను శ్రీలీల రిజెక్ట్ చేసిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Actress Sreeleela : టాలీవుడ్ యంగ్ సెన్షేషనల్ హీరోయిన్ శ్రీలీలకు రీసెంట్ గా ఓ బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని, కానీ ఆమె ఆ ఆఫర్ ను తిరస్కరించిందనే వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ నిర్మాత స్పందించారు. ఈ మేరకు నిర్మాత క్లారిటీ ఇస్తూ.. అది పూర్తిగా అవాస్తవమని, అసలు సినిమాలో పాత్ర కోసం ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ధావన్‌ ప్రధాన పాత్రలో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను శ్రీలీల రిజెక్ట్‌ చేసిందని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై ఆ చిత్ర నిర్మాత రమేశ్‌ స్పందించారు.

Also Read : టాలీవుడ్ లో విషాదం.. మంచు మనోజ్ డైరెక్టర్ మృతి, ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హీరో

" ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర కోసం మేము ఎవరినీ సంప్రదించలేదు. ఇప్పుడే తొలి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే ప్రధాన తారాగణంతో రెండో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. కథానాయికగా ఎవరిని ఎంపిక చేశామనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తాం. అప్పటివరకు ఏ వార్తలను నమ్మకండి" అని ప్రకటన విడుదల చేశారు.

Advertisment
తాజా కథనాలు