/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-4-6.jpg)
Hari Hara Veeramallu Movie : బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్, తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. నిఖిల్ 'కార్తికేయ 2' లో తన డైలాగ్స్ తో గూస్ బంప్స్ తెప్పించిన ఈయన.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో అత్యంత కీలకమైన పాత్రను అనుపమ్‌ఖేర్ పోషించనున్నట్టు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.
సినిమాలో అనుపమ్‌ఖేర్, పవన్‌కల్యాణ్ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు.ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో అనుపమ్ ఖేర్ రాక మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయనలాంటి సీనియర్ నటుడు తెలుగు తెరపై కనిపించడం అంటే అది ఒక విశేషమే. పవన్ కళ్యాణ్ తో ఆయన కాంబినేషన్ ఎలా ఉంటుందో అనే ఆత్రుత ప్రేక్షకుల్లో నెలకొంది.
We are honoured, thrilled and happy to welcome aboard Legendary actor and one of the greats of Indian Cinema, Shri @AnupamPKher garu to our prestigious Magnum Opus #HariHaraVeeraMallu 🔥
More updates very soon. ⚔️💥 pic.twitter.com/gWUmykO1LR
— Mega Surya Production (@MegaSuryaProd) August 8, 2024
Also Read : ఓటీటీలోకి క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్.. ‘ది బర్త్ డే బాయ్’ స్ట్రీమింగ్ డేట్ ఇదే!
'హరి హర వీరమల్లు' ఒక పాన్ ఇండియా చిత్రం కావడంతో, అనుపమ్ ఖేర్ రాక చిత్రానికి మరింత బలం చేకూర్చుతుంది. ఆయన నటనకు ఉన్న మంచి పేరు ఈ చిత్రానికి కలిసి వస్తుంది. ఇప్పటికే చిత్ర బృందం అద్భుతమైన కథనంతో, విజువల్ వండర్స్ తో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో అనుపమ్ ఖేర్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.