Salman Khan: బాలీవుడ్ భాయ్‌జాన్‌ సల్లూ భాయ్.. బర్త్ డే స్పెషల్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు. బాలీవుడ్ భాయ్‌జాన్‌, కండల వీరుడు సల్లూ భాయ్ పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాము..

New Update
Salman Khan: బాలీవుడ్  భాయ్‌జాన్‌ సల్లూ భాయ్.. బర్త్ డే స్పెషల్

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ నటుడు, నిర్మాత, రచయిత. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోగా తదైన ముద్ర వేసుకున్నారు. ఆయన 3 దశాబ్దాల సినీ జీవితంలో నిర్మాతగా, నటుడిగా ఎన్నో అవార్డులను అందుకున్నారు. భారతీయ సినీ నటుల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కమర్షియల్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరిగా పేర్కొన్నారు. 2015, 2018 లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న సెలెబ్రెటీల జాబితాలో సల్మాన్ ఖాన్ పేరును చేర్చింది.

సినీ జీవితం

1988 సల్మాన్ ఖాన్ 'బివి హో తో ఐసి' సినిమాలో సహాయనటుడిగా తన కెరీర్ మొదలు పెట్టారు. 1989లో సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో మైనే ప్యార్ కియా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి సినిమాతోనే నటుడిగా సల్లూ భాయ్ ప్రేక్షకుల ప్రశంశలు అందుకున్నారు. ఆ తర్వాత 'హమ్ ఆప్కే హై కౌన్', 'హమ్ సాథ్-సాథ్', 'హై బీవీ నం.1', 'కరణ్ అర్జున్', సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా నిలిచారు. అప్పటివరకు వరుస విజయాలతో దూసుకెళ్తున్న సల్మాన్ కెరీర్ కు 2000 నుంచి బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మళ్ళీ 2010 లో దబాంగ్ సినిమాతో సల్లూ భాయ్ తన వసూళ్ల వేట మొదలు పెట్టారు. రెడీ, బాడీగార్డ్ , ఏక్ థా టైగర్, కిక్, టైగర్ జిందా హై, సుల్తాన్ సూపర్ హిట్స్ అందుకున్నారు. 10 ఏళ్లలో అత్యధిక వసూళ్లు సాధించిన ప్రతీ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించారు.

publive-image

వ్యక్తిగత జీవితం

సల్మాన్ ఖాన్ పూర్తి పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్. సల్మాన్ ఖాన్ తండ్రి పేరు సలీం ఖాన్. ఈయన తండ్రి కూడా స్క్రీన్ రైటర్. సల్మాన్ ఖాన్ చంద్రముఖి సినిమాకు రైటర్ గా పని చేశారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. పెయింటింగ్ అంటే కూడా తనకు బాగా ఇష్టం. సల్మాన్ ఖాన్ హ్యూమన్ బీయింగ్ సంస్థ ను స్థాపించి ఎన్నో ఛారిటీలు చేశారు. ఫాండేషన్ ప్రారంభించిన మొదట్లో తన సొంత సంపాదనతో చారీటీలు చేశారు. ఆ తర్వాత 2011 లో SKBH పేరుతో సంస్థను స్థాపించి దాని ద్వారా వచ్చే డబ్బును ఫౌండేషన్ కు విరాళంగా అందించారు. సల్మాన్ ఖాన్ కు ఫుడ్ అంటే చాలా ఇష్టం. వాటిలో చైనీస్ ఫుడ్ ఆయనకు మరింత ఇష్టం.

Also Read: Salaar Collections: క్రిస్మస్‌ రోజూ సునామీ వసూళ్లు.. రికార్డులను ఊడ్చిపడేస్తున్న ప్రభాస్‌ సలార్!

Advertisment
తాజా కథనాలు