Ranbir kapoor: 3 సంవత్సరాల కష్టం ... 'రామాయణం' కోసం రణ్‌బీర్ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! స్టార్ హీరో రణ్బీర్ కపూర్ యానిమల్ తర్వాత రామాయణంలో రాముడు పాత్రలో తెర పై కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం రణ్బీర్ కపూర్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అతని జిమ్ ట్రైనర్ రాముడి లుక్ కోసం రణబీర్ కపూర్ 3 సంవత్సరాల కష్టానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. By Archana 25 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Ranbir kapoor: రణ్బీర్ కపూర్ రాబోయే చిత్రం 'రామాయణం కోసం చాలా కష్టపడుతున్నాడు. గత కొంత కాలంగా అతడి ఫిట్‌నెస్ శిక్షణకు సంబంధించిన పోస్టులు వరుసగా వస్తున్నాయి. ఇప్పుడు రణ్‌బీర్ శిక్షకుడు శివోహం 'రామాయణం' కోసం రణ్‌బీర్ ట్రాన్స్ఫామేషన్ చిత్రాలను పోస్ట్ చేశాడు. వీటిలో గత సంవత్సరం రణబీర్ లుక్ ఉంది, అందులో అతను యానిమల్ మూవీకి సంబంధించిన లుక్ ఉంది. దీని తరువాత, వాటిలో క్రమంగా మార్పులు చూపించబడ్డాయి. రామ్ అవతార్‌లో రణ్‌బీర్ లుక్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రణ్‌బీర్ ట్రాన్స్ఫామేషన్ నితీష్ తివారీ రామాయణం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. సెట్‌లోని చిత్రాలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే, తాజాగా రణ్‌బీర్ ట్రైనర్ రామాయణంలో అతని లుక్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. జిమ్ ట్రైనర్, శివోహం తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రణ్‌బీర్ బాడీ ట్రాన్స్ఫామేషన్ కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.. రణ్‌బీర్ మూడేళ్ల కష్టం ఇది 3 సంవత్సరాల కంటే ఎక్కువ శ్రమ. షార్ట్‌కట్‌ల ద్వారా ఏదీ సాధించలేము. ఏమి సాధించాలనే దానిపై స్పష్టత, దృక్పథం ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలనే దాని పై నిర్మాణాత్మక కార్యక్రమాన్ని కలిగి ఉండటం ముఖ్యం. దీని తర్వాత కూడా, ఆ లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం, క్రమశిక్షణ, స్థిరత్వం, ఫైర్ లేకపోతే మీరు ఎంత ప్లానింగ్ చేసినా ఏమీ జరగదు. ఇది చాలా అందమైన ప్రయాణం రణ్‌బీర్ తదుపరి బ్లాక్ బస్టర్ విజయానికి శుభాకాంక్షలు #రామాయణం అని రాసుకొచ్చారు View this post on Instagram A post shared by SHIVOHAAM (@shivohamofficial) Also Read: Pushpa 2: పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్.. అదిరిపోయిన పుష్ప టైటిల్ సాంగ్ #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి