/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-40-7.jpg)
Bollywood Actress Sushmita Sen Latest Interview :బాలీవుడ్ బ్యూటీ సుష్మిత సేన్ తన యవ్వనంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి తాజాగా షేర్ చేసుకున్నారు. 18 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలిచిన ఆమె.. తన ప్రసంగాలు, ఇంటర్వ్యూలతో అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ అప్పటి సమాజం ఆమె మాటలను అంతగా జీర్ణించుకోలేకపోయింది.
ఈ క్రమంలోనే సుష్మిత సేన్ తన తల్లిదండ్రులు తనను తప్పుబడుతూ, ఇంటర్వ్యూలలో 'సెక్స్' అనే పదాన్ని ఉపయోగించవద్దని చెప్పిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. అప్పటి సమాజంలో ఆమె మాట్లాడిన విషయాలు చాలా బోల్డ్ అని, ప్రజలు ఆమెను విమర్శించడంతో తన తల్లిదండ్రులు కూడా ఆమెను హెచ్చరించారని చెప్పారు.కానీ సుష్మిత సేన్ మాత్రం తన మాటలను వెనక్కి తీసుకోలేదు.
Also Read : ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణే.. కానీ ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది : ధనుష్
తాను ఒక స్వేచ్ఛా ప్రతిమగా ఉండాలని, సమాజం విధించిన బంధాల నుంచి తప్పించుకోవాలని భావించింనట్లు చెప్పారు. ఆమె మాటలకు అప్పట్లో విమర్శలు వచ్చినా.. తర్వాత కాలంలో ఆమె మాట్లాడిన తీరు చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది. కాగాసుష్మిత సేన్ తన గత అనుభవాలను పంచుకోవడంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వారిలో కొందరు ఆమె ధైర్యాన్ని అభినందించగా.. మరికొందరు అప్పటి సమాజం ఎలా ఉండేదో గుర్తు చేస్తున్నారు.