Raveena Tandon : షారుక్ ఖాన్ సినిమాను రిజెక్ట్ చేసిన 'KGF' నటి.. కారణం అదే అంటూ

బాలీవుడ్‌ నటి రవీనా టాండన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో అప్పట్లో తాను షారుక్ ఖాన్ సినిమాను రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. సినిమాలో తన పాత్రకు డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ తనకు నచ్చలేదని, అది అభ్యంతరకరంగా ఉందని, దీంతో సినిమా చేయడానికి నిరాకరించినట్లు చెప్పారు.

New Update
Raveena Tandon : షారుక్ ఖాన్ సినిమాను రిజెక్ట్ చేసిన 'KGF' నటి.. కారణం అదే అంటూ

Bollywood Actress Raveena Tandon : బాలీవుడ్‌లో అగ్ర నటిగా రాణించిన రవీనా టాండన్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అప్పట్లో తాను షారుక్ ఖాన్ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, రవీనా టాండన్ కాంబినేషన్ ఎంతో పాపులర్. వీరిద్దరూ కలిసి నటిస్తున్నారటంటే ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు.

షారుక్ ఖాన్, రవీనా టాండన్ కలిసి ‘యే లమ్హే జుదాయి కే’, ‘జాదు’, ‘జమానా దివానా’ వంటి సినిమాలు చేశారు. అయితే ఈ సినిమాల తర్వాత రవీనాకు మరోసారి షారుక్ తో యాక్ట్ చేస్తే ఛాన్స్ రాగా.. దాన్ని ఆమె రిజెక్ట్ చేసిందట. అందుకు గల కారణాన్ని తాజా ఇంటర్వ్యూలో తెలిపింది.

Also Read : రీ రిలీజ్ కి రెడీ అయిన మరో మెగా బ్లాక్ బస్టర్.. ఫ్యాన్స్ కి పండగే..!

" షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఓ సినిమాకు మొదట నన్నే హీరోయిన్‌గా అడిగారు. కథతో పాటు ఆ చిత్రంలో నా పాత్ర కూడా నాకు ఎంతో నచ్చింది. ఇక మూవీపై సైన్ చేసే క్రమంలో కాస్ట్యూమ్స్ గురించి తెలిపారు. ఆ సినిమాలో నేను వేసుకునే దుస్తుల గురించి చెప్పినప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అంత సౌకర్యంగా అనిపించలేదు. అందుకే రిజెక్ట్ చేశాను" అంటూ చెప్పుకొచ్చింది.

Advertisment
తాజా కథనాలు