Actress Alia Bhatt : మీడియాపై ఆలియా భట్ ఫైర్.. వీడియో వైరల్

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ మీడియాపై ఫైర్ అయింది. కారు దిగి తన అపార్ట్‌మెంట్‌లోకి వెళ్తుంటే కొందరు ఫోటోగ్రాఫర్స్ ఆమె వెనకాలే వెళ్లారు. రాకూడదని చెప్తున్నా వినకపోవడంతో.. ఫొటోగ్రాఫర్స్ పై ఆలియా అరుస్తూ..' ఏం చేస్తున్నారో తెలుస్తోందా? ఇది ప్రైవేట్‌ బిల్డింగ్..' అని హెచ్చరించింది.

New Update
Actress Alia Bhatt : మీడియాపై ఆలియా భట్ ఫైర్.. వీడియో వైరల్

Bollywood Actress Alia Bhatt : సినీ సెలెబ్రిటీలు బయట ఎక్కడ కనిపించినా మీడియా అలర్ట్ అవుతుంది. ముఖ్యంగా మన టాలీవుడ్ తో పోల్చుకుంటే బాలీవుడ్ లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాలీవుడ్ స్టార్స్ గడప దాటి బయటికెళ్తే చాలు మీడియా వాళ్ళను నీడలా ఫాలో అవుతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పర్సనల స్పేస్ కు ఇది ఇబ్బందిగా మారుతుంది.

తాజాగా ఆలియా భట్ కు సైతం ఇలాంటి సంఘటనే ఎదురైంది. దీంతో ఈ హీరోయిన్ మీడియాపై ఓ రేంజ్ లో ఫైర్ అయింది. ఆలియా భట్‌ కారు దిగి తన అపార్ట్‌మెంట్‌లోకి వెళ్తుంటే .. ఆలియా మేడం, ఒక్క నిమిషం.. అంటూ ఫోటోల కోసం అర్థించారు. ఆ అభ్యర్థనను పట్టించుకోకుండా ఆమె తన బిల్డింగ్‌లోకి వెళ్లిపోయింది.

Also Read : మెంటల్ మాస్ కాంబో.. బాలయ్యకు విలన్ గా స్టార్ హీరో?

అది ప్రైవేట్‌ బిల్డింగ్‌, ఎవరూ రాకూడదు అని ఆలియా టీమ్‌ సభ్యులు చెప్తున్నా వినిపించుకోకుండా కొందరు ఫోటోగ్రాఫర్లు వెనకాలే వెళ్లారు. అది చూసిన ఆలియాకు కోపం వచ్చింది. దీంతో ఫొటోగ్రాఫర్స్ పై అరుస్తూ..' ఏం చేస్తున్నారో తెలుస్తోందా? ఇది ప్రైవేట్‌ బిల్డింగ్..' అని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisment
తాజా కథనాలు