బీహార్‌ బాగమతి నదిలో పడవ బోల్తా ..18 మంది పిల్లలు గల్లంతు!

బీహార్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం సుమారు 33 మంది పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ పడవ బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులు గల్లంతయ్యారు. పడవ బోల్తా పడిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో 18 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు

New Update
బీహార్‌ బాగమతి నదిలో పడవ బోల్తా ..18 మంది పిల్లలు గల్లంతు!

బీహార్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం సుమారు 33 మంది పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ పడవ బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులు గల్లంతయ్యారు. పడవ బోల్తా పడిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో 18 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటన గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భాగమతి నదిలోని భట్గామ మధుర్‌పట్టి పీపాల్ ఘాట్ నుంచి చిన్నారులు పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

పోలీసులతో పాటు ఎన్డీఆర్‌ ఎఫ్ బృందాలు కూడా వెంటనే సహాయక చర్యలు చేపట్టగా ఇప్పటి వరకూ 18 మంది పిల్లలను రక్షించగా 15 మంది విద్యార్థుల ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తర్వాత స్థానిక డైవర్లు చిన్నారులను రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. నదిలో కొట్టుకు పోతున్న చాలా మంది పిల్లలను బయటకు తీశారు. మరికొంత మంది చిన్నారుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.  బోటులో స్కూల్ పిల్లలతో పాటు కొందరు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం.

మధుర్‌పట్టి ఘాట్ సమీపంలో బోటు ప్రమాదం జరిగిందని డీఎస్పీ తూర్పు సహరియార్ అక్తర్ తెలిపారు. పడవ సామర్థ్యం కంటే ఎక్కువ మంది పిల్లలు, మహిళలు ఎక్కడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత రక్షించిన కొంత మంది చిన్నారులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే పడవలో ఎంత మంది పిల్లలు ఉన్నారనేది .. ఎంత మంది మరణించారనే విషయం ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమన్నారు.

Advertisment
తాజా కథనాలు