Bihar: గంగానదిలో పడవ ప్రమాదం.. ఆరుగురు గల్లంతు!

బిహార్ రాష్ట్రంలో ప్రవహిస్తున్న గంగానదిలో దారుణం జరిగింది. 17 మందితో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా 6గురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

New Update
Bihar: గంగానదిలో పడవ ప్రమాదం.. ఆరుగురు గల్లంతు!

Boat accident: బిహార్ బార్హ్ పట్టణం సమీపంలోని గంగానదిలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం పదిహేడు మందితో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మరో ఆరుగురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన ఆరుగురి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

పవడ బార్హ్ ఉమానాథ్ ఘాట్ నుంచి డయారాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. మే19న బీహార్‌లోని మహావీర్ తోలా గ్రామ సమీపంలో గంగా నదిలో పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు అదృశ్యమైన సంగతి తెలిసిందే. కొందరు రైతులు తమ కూరగాయలను పడవలో తీసుకెళ్తుండగా.. మహావీర్ తోలా ఘాట్ వద్దకు చేరుకునే క్రమంలో పడవ బోల్తా పడింది.

Advertisment
తాజా కథనాలు