Board Exam Diet Tips: బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ సమయంలో వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సమయంలో బలహీనమైన ఆరోగ్యం బోర్డు పరీక్షలలో మీ పనితీరును ప్రభావితం చేస్తుంది. అందువల్ల, బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆరోగ్యంగా (Healthy) ఉండటానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. అంతేకాదు సరైన నిద్రకూడా చాలా ముఖ్యం.
దేశవ్యాప్తంగా 10వ తరగతి (SSC), 12వ తరగతి (Intermediate) బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. బోర్డు పరీక్షల సమయంలో, చాలా మంది విద్యార్థులు మెరుగైన ప్రిపరేషన్ కోసం పగలు రాత్రి చదవుతుంటారు. దీని కారణంగా వారు తమ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధచూపరు. పరీక్షల సమయంలో విద్యార్థులు తినడానికి ఇష్టపడరు. ప్రిపరేషన్ కారణంగా నిద్రలేని రాత్రులను గడుపుతారు. చదువుతున్నప్పుడు ఒత్తిడికి గురికావడం వంటి సమస్యలు వెంటనే ప్రారంభమవుతాయి.ఇవన్నీ కూడా పరీక్షల పై ప్రభావం చూపుతాయి. బోర్డు పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
సమతుల్య ఆహారం ముఖ్యం:
బోర్డు పరీక్షల సమయంలో తినడానికి సమయాన్ని సెట్ చేయండి. నిత్యం ఏదో ఒకటి తినడం మానేయాలి. సమతుల్య ఆహారం కోసం, మీరు మీ ఉదయాన్నే ఒక గ్లాసు పాలతో (Milk) పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్‌తో (Dry Fruits) ప్రారంభించవచ్చు. దీని తరువాత, మీరు 12 నుండి 1 గంటల మధ్య సరైన ఆహారాన్ని తినవచ్చు. ఇందులో రోటీ, కూరగాయలు, పెరుగు మొదలైనవి ఉంటాయి. దీని తర్వాత మీరు 4 నుండి 6 గంటల వరకు జ్యూస్ లేదంటే కాలానుగుణ ఆహారాన్ని తీసుకోవచ్చు. రాత్రి భోజనంలో పప్పుతో కూడిన కిచడీ, గంజి లేదా ఒకటి నుండి రెండు రోటీలు వంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ఈ డైట్ ఫాలో అవుతే మీరు పరీక్ష సమయంలో ఆరోగ్యంగా ఉంటూ..పరీక్షకు బాగా సిద్ధం కాగలరు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు సమతుల్య ఆహారం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
సరైన నిద్ర చాలా ముఖ్యం:
మీరు పగలు, రాత్రి చదువుతూ ఉంటే, అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. బోర్డు పరీక్షల ఒత్తిడి మీపై పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్రపోవడం మంచిది.ఇలా తగినంత నిద్ర ఉంటే మీ శరీరం శక్తివంతంగా, సోమరితనానికి దూరంగా ఉంటుంది. బోర్డు పరీక్షలకు మరింత మెరుగ్గా ప్రిపేర్ చేయడం ద్వారా, మీరు పరీక్షలలో మెరుగైన ప్రతిభను సాధిస్తారు.
ఇది కూడా చదవండి: ఈ పవర్ ఫుల్ ఫోన్‌పై..ఏకంగా రూ. 4000 డిస్కౌంట్..పూర్తివివరాలివే.!