Blood Pressure Diet: ఈ ఆరోగ్య ఇబ్బంది ఉన్నవారు శీతాకాలం ఈ డైట్ ట్రై చేయండి.. శీతాకాలంలో చాలా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వాటిలో అధిక రక్తపోటు సమస్య కూడా ఒకటి. రక్తపోటును అదుపులో ఉంచడానికి అశ్వగంధ, వెల్లుల్లి,పిస్తాపప్పు, మెంతి కూర శీతాకాలంలో చాలా సహాయపడతాయి. వీటిని రెగ్యులర్ గ తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు By KVD Varma 25 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Blood Pressure Diet: చలికాలంలో రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది! ఇప్పటికే ఈ ఇబ్బందితో ఉన్నవారికి శీతాకాలం ఆ సమస్య ఇంకొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు - లైఫ్ స్టైల్ లో సీపరీతా మార్పుల కారణంగా, చాలా మంది ప్రజలు ఇప్పుడు అధిక రక్తపోటు బాధితులుగా మారుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. చలికాలంలో ఎటువంటి ఆహారం తీసుకుంటే రక్తపోటు విషయంలో ఇబ్బంది పడకుండా ఉండవచ్చో తెలుసుకుందాం. Blood Pressure Diet: డయాబెటిస్ లాగే ఇప్పుడు హైబీపీ సమస్య కూడా సర్వసాధారణమైపోయింది. దీనికి కారణం మన గందరగోళ జీవనశైలి. వృద్ధులే కాదు యువత కూడా హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఏది ఏమైనా చలికాలంలో ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. చలిలో రక్తపోటు పెరగడం అంటే హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ సీజన్‌లో ధమనులు -గుండెపై అధిక ఒత్తిడి కారణంగా రక్తపోటు పెరుగుతుంది. అంతే కాకుండా చలికాలంలో ఆహారంలో మార్పు, శారీరక శ్రమ తగ్గడం కూడా ఇందుకు కారణం. కానీ అధిక రక్తపోటు సమస్యను నియంత్రించడానికి, మీరు కొన్ని సూపర్ ఫుడ్స్ ఉపయోగించవచ్చు. బీపీని నియంత్రించే ఆహారాల గురించి తెలుసుకుందాం. Also Read: వేరుశెనగ నూనెతో అందం.. ఆరోగ్యం.. ఇలా ట్రై చేసి చూడండి! అశ్వగంధ అశ్వగంధ అనేక వ్యాధుల నివారణ కోసం ఉపయోగిస్తారు. రక్తపోటు సమస్యలో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బరువు పెరగడం లేదా అధిక రక్తపోటుతో బాధపడేవారు తప్పనిసరిగా అశ్వగంధను ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీటితో ఒక చెంచా అశ్వగంధ పొడిని తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లి వెల్లుల్లిని చాలా హోం రెమెడీస్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. రక్తపోటు సమస్య ఉన్నవారు ప్రతిరోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తినాలి. దీంతో బీపీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. పిస్తాపప్పు పొటాషియం, మెగ్నీషియం - మోనోశాచురేటెడ్ ఫాట్ వంటి అనేక మూలకాలు పిస్తాలో కనిపిస్తాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అధిక BP సమస్యలో దీనిని ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మెంతికూర మెంతి గింజలను చాలారకాలుగా నిత్యం ఇళ్లలో ఉపయోగిస్తారు. మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో దీన్ని తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే మెంతికూరలో కరిగే ఫైబర్ పుష్కలంగాఉంటుంది. అంతే కాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా మెంతి కూర తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడానికి మెంతి కూర ఎక్కువ సహాయపడుతుంది. Watch this interesting Video: #blood-pressure #winter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి