Black Cardamom: నల్ల యాలకులతో అనేక అనారోగ్య సమస్యలు పరార్

తరచూ ఆనారోగ్య సమస్యలతో బాధపడేవారు నల్ల యాలకులు ఎంతో మేలు చేస్తాయి. ఇవి తినటం వలన చర్మం నున్నగా, గుండె ఆరోగ్యంగా, ఆకలి అధికం, కిడ్నీ సమస్యలకు నివారణతోపాటు నోటి దుర్వాసన తగ్గి దంతాల, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

New Update
Black Cardamom: నల్ల యాలకులతో అనేక అనారోగ్య సమస్యలు పరార్

Black Cardamom: వంటింట్లోనే అనేక సుగంధద్రవ్యాలు, ఔషధాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఇవి ఎంతో మేలు చేస్తామని అంటారు. ఇలాంటి ఔషధాలు కలిన వాటిల్లో నల్ల యాలకులు ఒకటి. సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులను ఎక్కువ వాడుతారు. కానీ నల్లగా, పెద్దగా ఉంటే నల్ల యాలకులు ఉన్నాయి. ఈ యలకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు నల్లయాలకులని తింటే ఎన్నో ఆనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. యాలకులంటే ఆకుపచ్చ రంగులో, చిన్నగా మాత్రమే ఉంటాయని చాలామంది అనుకుంటారు. నల్లయాలకులు తింటే ఎలాంటి ఉపయోగాలన్నాయో..? ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

చర్మం నున్నగా:

  • పెద్ద యాలకుల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియంలు చర్మ, రక్త ప్రసరణకు మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని నున్నగా, అందంగా, మెరిసేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

గుండె ఆరోగ్యం:

  • పెద్ద యాలకులు గుండె పనితీరుకు మేలు చేస్తుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్స్ గుండె సమస్యలు తొలగిపోయేలా చేస్తుంది. గుండె కండరాల కణజాలంపై మంచిగా పనిచేస్తాయి.

దంతాలకు మంచిది:

  • పెద్ద యాలకులు నోటి దుర్వాసన తగ్గి దంతాల ఇన్ఫెక్షన్, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిల్లో ఉంటే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో నోటిలోని బ్యాక్టీరియా తగ్గిస్తుంది.

కిడ్నీ సమస్యలకు నివారణ:

  • ప్రతీరోజూ పెద్దయాలకులని తీసుకోవటం వలన కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. వీటి ద్వారా మూత్రవిసర్జన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఆకలి అధికం:

  • పెద్ద యాలకులు తింటే ఆకలి లేనివాకి ఆకలి పెరుగుతుంది. కడుపులో గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తొలిగిపోతాయి.

ఇది కూడా చదవండి: రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? నానబెట్టి తినాలా? నార్మల్‌గా తినాలా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు