బీజేవైఎం ఆధ్వర్యంలో నేడు ఆందోళనకు పిలుపునిచ్చారు బీజేవైఎం కార్యకర్తలు. నిరుద్యోగ భృతి & గ్రూప్-2 పరీక్ష వాయిదాపై ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయాలం ముందు ధర్నా చేయాలని నిర్ణయించారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని బీజేవైఎం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 ఏళ్లగా ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేసిందని నాయకులు ఆరోపించారు. లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్-2 పరీక్షను 3 నెలల సమయం ఇచ్చి.. తరువాత పరీక్ష నిర్వహించాలని ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. ఎన్నికల్లోయువతకు ప్రతినెలా చెల్లిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం.. ఇంతవరకు ఏ ఒక్క నిరుద్యోగికి ఆ పథకం అందలేని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతి ప్రతినెలా రూ.3016 ఇస్తామ చెప్పారు. ఇప్పటివరకు 56 నెలల మొత్తం 1 లక్షా 68 వేల 896 రూపాయలు మొత్తాన్ని వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. TSPSC బోర్డ్ నోటిఫికేషన్లు, పరీక్షల, నియమాలను తప్పుల తడక మార్చి నిరుద్యోగులు, యువకుల తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిన TSPSC చైర్మన్‌ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరీంత ఉధృతం చేస్తామని, నిరసనలతో పాటు సెక్రటేరియట్, ప్రగతిభవన్‌ని ముట్టడిస్తామని బీజేవైఎం ( BJYM)తరుపున రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు.
నిన్న హైదరాబాద్‌లోని నాంపల్లి దగ్గర ఓయూ జేఏసీ నేతలు ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు రద్దు చేయాలని వారి టీఎస్పీఎస్సీ ముందు డిమాండ్ చేశారు. నిన్న ఎంతో ఉద్రిక్తకు దారి తీయగా.. ఈ రోజు బీజేవైఎం కార్యకర్తలు మరో ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలన్న వారు.. నిరుద్యోగలకు ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే అమలు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతో భాగ్యనగరంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇందులో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమంలో BJYM రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ పాల్గొన్నారు.