నాలుగురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదల అవుతున్నాయి. ఇందులో రాజస్థాన్లో బీజేపీ బోణీ కొట్టింది. మెజార్టీ మార్క్ ను దాటి ఆధిక్యం దిశగా దూసుకువెళుతోంది. మొత్తం 199 స్థానాల్లో రెండు చోట్ల గెలిచి, మరో 115 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ 67 చోట్ల ముందంజలో ఉంది. ఇతరులు ఒక చోట గెలిచి.. 14 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
దీని మీద కేంద్ర మంత్రి, బీజేపీ నేత గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ.. రాజస్థాన్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. 2/3 మెజార్టీతో బీజేపీ గెలుస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.
#WATCH | Union minister and BJP leader Gajendra Singh Shekhawat says, "BJP will win with a huge majority in Rajasthan. Jadugar ka jadoo khatam ho gaya hai. In MP, the BJP will form govt with a 2/3 majority. In Chhattisgarh, the party will form the govt." pic.twitter.com/G2kO36kHlu
— ANI (@ANI) December 3, 2023
మరోవైపు మధ్యప్రదేశ్ (మొత్తం 230 స్థానాలు)లో భాజపా 159, కాంగ్రెస్ 67 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు ఛత్తీస్‌గఢ్‌లో (మొత్తం 90 స్థానాలు) భాజపా 54, కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు ఒక చోట ముందంజలో ఉన్నారు.