Delhi: అదే మా మూలసూత్రం.. మూడోసారి గెలుపుపై అనుమానం లేదు: మోడీ

మూడోసారి బీజేపీ గెలుపుపై ఎవరూ అనుమానపడాల్సిన అవసరం లేదని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో మాట్లాడుతూ ఈసారి 370 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ వంద రోజులు కొత్త శక్తి, ఉత్సాహం, విశ్వాసంతో పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Delhi: అదే మా మూలసూత్రం.. మూడోసారి గెలుపుపై అనుమానం లేదు: మోడీ
New Update

BJP: రెండో బీజేపీ (BJP) జాతీయ మండలి సమావేశాల్లో ప్రధానమంత్రి మోడీ (PM Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహిస్తున్న బీజేపీ జాతీయ మండలి సమావేశంలో కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. రాబోయే 100 రోజులు మరింత ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

దేశ రూపురేఖలు మారిపోయాయి..
ఈ మేరకు మోడీ మాట్లాడుతూ.. 'నవభారత్‌ నిర్మాణం కోసం అహర్నిశలు పనిచేద్దాం. ఈ వంద రోజులు పార్టీకి ఎంతో కీలకం. ఈసారి 370 సీట్ల గెలుస్తాం. గెలవాల్సిందే. గడిచిన పదేళ్లలో దేశ రూపురేఖలు మారిపోయాయి. 25 కోట్లమంది పేదరికం నుంచి బయటపడ్డారు. భారత్‌ అభివృద్ధిని ప్రపంచమంతా గుర్తిస్తోంది. దేశం కోసం మనం చేయాల్సింది చాలా ఉంది. ఏక్‌భారత్‌, శ్రేష్ట్‌ భారత్‌ అన్నదే మన నినాదం’అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మూడోసారి గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదని, రాజకీయ పండితులెవరికీ మన గెలుపు కారణాలు దొరకవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి : Credit Card: క్రెడిట్ కార్డ్ జాగ్రత్తగా వాడకపోతే కష్టాలు తప్పవు.. ఎందుకంటే..

ప్రజల ఆశీర్వాద వర్షం కురుస్తోంది..
ఇక తాను గల్లీల వెంట వెళ్తున్నప్పుడు ప్రజల ఆశీర్వాద వర్షం కురుస్తోందని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయ మూలసూత్రం. భిన్నత్వంలో ఏకత్వం మరింత బలోపేతం దిశగానే పనిచేస్తున్నామని తెలిపారు. అ పార్టీ ప్రతిష్టతో పాటు దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటున్న కార్యకర్తలందరికీ అభినందనలు చెప్పారు. బీజేపీ కార్యకర్తలు ఏడాదిలో ప్రతిరోజూ దేశానికి సేవ చేసేందుకు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాని, బీజేపీ కార్యకర్తలు 24 గంటలు దేశం కోసం కష్టపడుతున్నారన్నారని పొగిడారు. కానీ ఇదే అసలు సమయం. 100 రోజులు కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో, కొత్త విశ్వాసంతో పనిచేయాలి. ప్రతిపక్ష నేతలు కూడా ఎన్డీయే 400 దాటిందంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ దేశాన్ని భారీ కుంభకోణాలు, ఉగ్రవాదం నుంచి బీజేపీ విముక్తి చేసింది. మనం శివాజీని నమ్మేవాళ్లం. దేశానికి సేవ చేసేందుకు బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

#narendra-modi #370-seats #bjp-national-council-meeting
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe