Amit Shah: 272 కంటే తక్కువ సీట్లు వస్తే ఎలా?.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు పక్కాగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. తమ పార్టీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని.. SC, ST, OBC రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఎప్పుడు ఉంటుందని అన్నారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

Amit Shah: 272 కంటే తక్కువ సీట్లు వస్తే ఎలా?.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
New Update

Amit Shah: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని.. కేంద్రంలో మరోసారి బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇండియాకు కూటమికి 200 ఎంపీ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.

ALSO READ: ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ములాఖత్

272 కంటే తక్కువ సీట్లు గెలిస్తే ఎలా?

లోక్‌సభ ఎన్నికల్లో 272 కంటే తక్కువ సీట్లు గెలిస్తే బీజేపీ చర్య ఏమిటని అడిగిన జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానం ఇస్తూ.. “నాకు అలాంటి అవకాశాలు కనిపించడం లేదు, 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యం ప్రధాని మోదీకి అండగా నిలుస్తోంది. వారికి కులం లేదా వయస్సు లేదు... ఈ ప్రయోజనాలన్నీ పొందిన వారు నరేంద్ర మోదీ ఈసారి 400 సీట్లు కట్టబెడుతారు" అని తెలిపారు. "ప్లాన్ ఎ విజయవంతం కావడానికి 60% కంటే తక్కువ అవకాశం ఉన్నప్పుడే ప్లాన్ బిని రూపొందించాలి. ప్రధాని మోడీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను," ఆయన అన్నారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్‌లకు మా మద్దతు..

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్‌లకు ప్రధాని మోదీయే అతిపెద్ద మద్దతుదారు అని అమిత్ షా అన్నారు. ఉత్తర-దక్షిణ విభజన కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ చేసిన ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అన్నారు. "ఇది ప్రత్యేక దేశం అని ఎవరైనా చెబితే, అది చాలా అభ్యంతరకరం, ఈ దేశం ఇప్పుడు ఎప్పటికీ విభజించబడదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక పెద్ద నాయకుడు ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని విభజించడం గురించి మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీ దానిని కూడా ఖండించలేదు. కాంగ్రెస్ పార్టీ ఎజెండా గురించి దేశ ప్రజలు ఆలోచించాలి" అని వ్యాఖ్యానించారు.

#amit-shah
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe