Kishan Reddy: ఫోన్ ట్యాపింగ్ తో వారి జీవితాలతో ఆటలు.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు

గత ప్రభుత్వ హయాంలో తమ సిబ్బంది, నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కవిత అరెస్ట్ కు బీజేపీకి సంబంధం లేదన్నారు.

New Update
Kishan Reddy : రేవంత్‌లో అసహనం పెరిగిపోతుంది.. కిషన్‌రెడ్డి సెటైర్లు

Kishan Reddy Comments On Phone Tapping: ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నేతలపై, అధికారుల మీద, వ్యాపారుల గత జీవితాలపై కూడా ఫోన్ ట్యాపింగ్ తో దాడి చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ అధికారులు (Telangana Police) మాఫియాలా వ్యవహరించి ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. తమ సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించారన్నారు. ఉగ్రవాదుల విషయంలోనే ముందస్తు అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి ఉంటుందన్నారు.
ఇది కూడా చదవండి: KTR: బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరడంపై.. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కానీ అలా కాకుండా ఇష్టారీతిగా ఫోన్ ట్యాపింగ్ చేశారని ధ్వజమెత్తారు. బ్లాక్ మెయిలింగ్ కోసం ట్యాపింగ్ వాడారన్నారు. బీజేపీ నేత బీఎస్ సంతోష్ ఫోన్ ను కూడా ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు అప్పటి సీఎం కేసీఆర్ (CM KCR) బాధ్యుడని ఆరోపించారు. కవితపై అక్రమ కేసులు పెట్టారని కేటీఆర్ అంటున్నాడన్నారు అయితే.. మద్యం కుంభకోణంలో ఉన్నారా? లేదా? అని ప్రశ్నించారు. కవిత అరెస్ట్ తో బీజేపీకి సంబంధం లేదన్నారు. ఆమె తెలంగాణ పరువు తీశారన్నారు.
ఇది కూడా చదవండి: Vemula Veeresham: లక్షల ఎకరాలు కబ్జా.. జగదీష్ రెడ్డి వేముల వీరేశం సంచలన ఆరోపణలు

వెలుగులోకి సంచలన విషయాలు
ఇదిలా ఉంటే.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వెలుగులోకి సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్‌లో SIBకి టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ కీలకంగా మారారు. రవిపాల్ నేతృత్వంలోనే ట్యాపింగ్ డివైజ్‌లను తీసుకొచ్చినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. కేంద్రం అనుమతి లేకుండానే ఈ పరికరాలను తీసుకువచ్చినట్లు తేలినట్లు సమాచారం.

300 మీటర్ల పరిధిలో మాట్లాడే మాటలను నేరుగా వినే అధునాతన డివైజ్‌లను రవిపాల్ దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని ఈ డివైజ్‌ ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావు, రవిపాల్ విన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవిపాల్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు