TS BJP: నేను పోటీ చేయను.. తెలంగాణ బీజేపీకి మరో కీలక నేత షాక్!

తెలంగాణ ఎన్నికల్లో పోటీకి బీజేపీ ముఖ్య నేతలు ఒక్కొక్కరు దూరం అవుతున్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తాము పోటీ చేయమని అధిష్టానానికి చెప్పగా.. తాజాగా డీకే అరుణ సైతం తాను పోటీ చేయనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Big Breaking: మరో ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ.. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు మార్పు..
New Update

వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న తెలంగాణ బీజీపీకి (TS BJP) అగ్రనేతలు షాక్ ఇస్తున్నారు. అనేక మంది సీనియర్ నేతలు తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయమంటూ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ (Laxman) తాము పోటీ చేయమని అధిష్టానానికి స్పష్టం చేశారు. తాజాగా మరో సీనియర్ నాయకురాలు డీకే అరుణ (DK Aruna) సైతం పోటీకి దూరంగా ఉంటానని అగ్రనేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని.. అసెంబ్లీకి మాత్రం బరిలో ఉండనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కీలక నేతలే పోటీ చేయకుంటే.. ఓటర్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావన పార్టీ నేతలు, శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.
ఇది కూడా చదవండి: Telangana: బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా.. జనతా కా మూడ్ సర్వే లెక్కలివే..

ఇదిలా ఉంటే.. ఈ రోజు బీజేపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ (BJP Final List) విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించి 2 లిస్ట్ లను విడుదల చేసింది. ఈ లిస్ట్ లలో మొత్తం 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఇది కూడా చదవండి: TS Politics: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు?

మిగతా 66 స్థానాల్లో కొన్నింటిని పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇవ్వనుంది బీజేపీ. ఇవి పోగా మిలిగిన స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు ముఖ్య నాయకులు. జనసేనకు 9 లేదా 10 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

#bjp #telangana-elections-2023 #dk-aruna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe