Telangana BJP: తెలంగాణ బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల.. వివరాలివే..

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా వచ్చేసింది. ఈ జాబితాలో కేవలం ఒక్కరి పేరును మాత్రమే ప్రకటించింది బీజేపీ. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఏపీ మిథున్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. ఇప్పటికే మొదటి విడత జాబితాను విడుదల చేసిన బీజేపీ.. ఇప్పుడు రెండో విడత పేరుతో ఒక్కరి పేరునే ప్రకటించడం ఇంట్రస్టింగ్ గా మారింది.

New Update
Telangana BJP: తెలంగాణ బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల.. వివరాలివే..

Telangana BJP: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా వచ్చేసింది. ఈ జాబితాలో కేవలం ఒక్కరి పేరును మాత్రమే ప్రకటించింది బీజేపీ. మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి ఏపీ మిథన్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది బీజేపీ అగ్రనాయకత్వం. సెకండ్ లిస్ట్‌లో ఈయన ఒక్కరి పేరును మాత్రమే ధృవీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది. కాగా, మిథున్ రెడ్డి.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయడు. ఇక జితేందర్ రెడ్డి మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.

వాస్తవానికి మిథున్ రెడ్డి షాద్ నగర్ నుంచి.. జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి.. పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఆ క్రమంలోనే మిథున్ రెడ్డి ఎక్కువగా షాద్ నగర్‌పైనే ఫోకస్ చేశారు కూడా. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో.. బీజేపీ అధిష్టానం తన ప్లాన్‌ను మార్చుకుంది. మిథున్ రెడ్డికే మహబూబ్‌నగర్‌ను కేటాయించింది. ఇక జితేందర్ రెడ్డిని మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా బరిలోకి దించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇదే..

☛ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా
☛ సిర్పూర్- డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
☛ బెల్లంపల్లి (SC)- అమరాజుల శ్రీదేవి
☛ ఖానాపూర్ (ST) రమేష్ రాథోడ్
☛ ఆదిలాబాద్- పాయల్ శంకర్
☛ బోథ్ - సోయం బాపు రావు
☛ నిర్మల్ -ఆలేటి మహేశ్వర్ రెడ్డి
☛ ముథోల్- శ్రీరామరావు పటేల్
☛ ఆర్మూర్- శ్రీ పైడి రాకేష్ రెడ్డి
☛ జుక్కల్ - అరుణ తార
☛ బాల్కొండ - అన్నపూర్ణమ్మ ఆలేటి
☛ కోరుట్ల -ధర్మపురి అర్వింద్
☛ కామారెడ్డి- కె. వెంకట రమణా రెడ్డి
☛ నిజామాబాద్ అర్బన్- సూర్యనారాయణ గుప్తా
☛ జగిత్యాల -డాక్టర్ బోగ శ్రావణి
☛ ధర్మపురి (SC)- శ్రీ ఎస్ కుమార్
☛ రామగుండం- కందుల సంధ్యా రాణి
☛ కరీంనగర్- బండి సంజయ్ కుమార్
☛ చొప్పదండి - బొడిగ శోభ
☛ సిరిసిల్ల- రాణి రుద్రమ రెడ్డి
☛ మానకొండూర్ (SC)- శ్రీ ఆరేపల్లి మోహన్
☛ హుజూరాబాద్- ఈటల రాజేందర్
☛ నర్సాపూర్ -ఎర్రగొల్ల మురళీ యాదవ్
☛ పటాన్‌చెరు - నందీశ్వర్ గౌడ్
☛ దుబ్బాక- మాదవనేని రఘునందన్ రావు
☛ గజ్వేల్ -ఈటల రాజేందర్
☛ కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్
☛ ఇబ్రహీంపట్నం- నోముల దయానంద్ గౌడ్
☛ మహేశ్వరం- అందెల శ్రీరాములు యాదవ్
☛ ఖైరతాబాద్- చింతల రామచంద్రారెడ్డి
☛ కార్వాన్ - అమర్ సింగ్
☛ గోషామహల్ -టి రాజా సింగ్
☛ చార్మినార్- మేఘ రాణి
☛ చాంద్రాయణగుట్ట- సత్యనారాయణ ముదిరాజ్
☛ యాకుత్‌పురా-వీరేందర్ యాదవ్
☛ బహదూర్‌పురా- వై. నరేష్ కుమార్
☛ కల్వకుర్తి- తల్లోజు ఆచారి
☛ కొల్లాపూర్- ఆల్లెని సుధాకర్ రావు
☛ నాగార్జున సాగర్- కంకణాల నివేదిత రెడ్డి
☛ సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వర్ రావు
☛ భువనగిరి- గూడూరు నారాయణ రెడ్డి
☛ తుంగతుర్తి (SC)- కడియం రాంచంద్రయ్య
☛ జనగాం- డాక్టర్ ఆరుట్ల దశమంత్ రెడ్డి
☛ స్టేషన్ ఘన్‌పూర్ (SC)- డాక్టర్ గుండె విజయ రామారావు
☛ పాలకుర్తి- లేగా రాంమోహన్ రెడ్డి
☛ డోర్నకల్ (ST)- భూక్య సంగీత
☛ మహబూబాబాద్ (ST)- జాథోట్ హుస్సేన్ నాయక్
☛ వరంగల్ పశ్చిమ- రావు పద్మ
☛ వరంగల్ తూర్పు -ఎర్రబెల్లి ప్రదీప్ రావు
☛ వర్ధన్నపేట (SC) -కొండేటి శ్రీధర్
☛ భూపాలపల్లె - చందుపట్ల కీర్తి రెడ్డి
☛ ఇల్లందు (ఎస్టీ) -రవీంద్ర నాయక్
☛ భద్రాచలం (ST) - కుంజా ధర్మ రావు

Also Read:

పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్!

ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు