BJP Purandeswari: బిజెపి అధికారం లేని రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిధులే వందల కోట్లు అవినీతికి పాల్పుడుతున్నారని ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహూ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తే రూ. 200 కోట్ల నగదు అధికారికంగా లెక్క తేల్చారని అన్నారు. అయితే ఇంకా లెక్క తేల్చాల్సిన నగదు చాలా ఉందన్నారు. అధికారులు చెబుతున్న తీరు పరిశీలిస్తే కాంగ్రెస్ ఎంపిల అవినీతి ఎంత ఉందో తేలుతోందన్నారు. ధీరజ్ సాహూ కుటుంబ సభ్యుల పై జరుగుతున్న దాడుల్లో లెక్కకు మించిన నల్లధనం వెలుగు చూస్తోందని వివరించారు. చత్తీస్ ఘడ్, ఒరిస్సా, జార్ఖాండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ధీరజ్ సాహూ కుటుంబ సభ్యుల పై జరుగుతున్న దాడుల్లో లెక్కకు మించిన నల్లధనం భయటపడుతోందన్నారు.
Also read: ఏపీలో ఆలుగడ్డ, ఉల్లిగడ్డ రాజకీయం.. జగన్ కామెంట్స్ పై చంద్రబాబు సెటైర్లు.!
అవినీతిని దేశం నుండి నిర్మూలించి, దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శ్రమిస్తుంటే.. భావసారూప్యత లేని రాజకీయ పార్టీలు అన్ని ఒక వేదిక పైకి వచ్చి మోదీని నిలువరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలో లేని రాష్ట్రాల్లో అవినీతి భారీ స్ధాయిలో జరగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి నాయకుడు మల్లిఖార్జున ఖర్గే బిజెపిని ఓడించడం కోసమే కూటమి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమిలో ఉన్న అన్ని పార్టీలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయని ఆరోపించారు. తమిళనాడులో కూడా అవినీతికి అంతం లేని పరిస్ధితిలు ఉన్నాయని ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు.