Purandeswari: చంద్రబాబుకు బెయిల్..పురందేశ్వరి ఏమన్నారంటే..?

చంద్రబాబు బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. జరుగుతున్న పరిణామాలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిందన్న వార్త చాలా సంతోషం కలిగించిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్ ప్రక్రియలో చోటుచేసుకున్న విధాన పరమైన లోపాలను బీజేపీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

AP BJP: వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్ ప్రభుత్వం.. పురంధేశ్వరి చురకలు
New Update

Purandeswari Comments on Chandrababu Bail:   స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి బయటికొచ్చారు. దాదాపు 52 రోజుల జైలు జీవితం తర్వాత చంద్రబాబు నాయిడు కొద్ది సేపటి క్రితం విడుదలవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. చంద్రబాబుకు అచ్చెన్నాయుడు, బాలకృష్ణతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 'నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరంతా 52 రోజులు ఎక్కడికక్కడ నా కోసం సంఘీభావం తెలియజేశారు. పూజలు చేశారు. మీరు చూపిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. ఏపీ, తెలంగాణలో రోడ్లపై చేసిన నిరసనలను నేను ఎప్పటికీ మర్చిపోను. ఎక్కడికక్కడ నేను చూసిన అభివృద్ధిని గుర్తించారు' అంటూ వ్యాఖ్యనించారు.

Also read: రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు

తాజాగా, చంద్రబాబుకు బెయిల్ లభించడం పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. విపక్ష నేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్న వార్త చాలా సంతోషం కలిగించిందని వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ ప్రక్రియలో చోటుచేసుకున్న విధాన పరమైన లోపాలను బీజేపీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉందని పురందేశ్వరి స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు లభించాలని, తిరుమల వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఆయనసై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

#chandra-babu #bjp-purandeswari
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe