/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/purendeswari.jpg)
Purandeswari : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన 41వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. సినీ సెలబ్రేటిలతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం ట్విటర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన మేనత్త, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్టీర్ కు హ్యాపీ బర్త్ డే అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని పోస్ట్ చేశారు.
Also Read: రేవ్ పార్టీలో సంచలన విషయాలు.. టాలీవుడ్ హీరో, ఏపీ మంత్రి సన్నిహితులు?
Happy Birthday @tarak9999 ! ✨💐
Wishing you a serene and joyful day. May the year ahead bring you good health & happiness. Enjoy your special day.#HappyBirthdayNTR pic.twitter.com/fMrFFUyWX4— Daggubati Purandeswari 🇮🇳 (Modi Ka Parivar) (@PurandeswariBJP) May 20, 2024
ఇదిలా ఉండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో జూ. ఎన్టీఆర్ స్పందిస్తారని పలువురు భావించారు. అయితే, ఆయన మాత్రం ఏమీ రియాక్ట్ కాలేదు. కనీసం ఎన్నికల టైం లోనైనా జూ. ఎన్టీఆర్ టీడీపీకి సపోర్ట్ చేస్తారని చాలా మంది రాజకీయ ప్రముఖులు, టీడీపీ ముఖ్యనేతలు అనుకున్నారు. కానీ, ఎన్టీఆర్ కేవలం సినిమాలపైనే ఫొకస్ పెడుతూ.. పొలిటికల్ గా మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు.