/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bjp-3-1-jpg.webp)
BJP Purandeswari Alleges Corruption On liquor Sale in AP : ఏపీ సర్కారు మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. ఏపీలో మధ్యం అమ్మకాలు, మధ్యం తయారీ విషయంపై దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2019 నుండి మద్యం తయారీ కంపెనీలను వైసీపీ నేతలు బెదిరించి, బలవంతంగా లాక్కొన్నారని ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రామ చంద్రారెడ్డి తో పాటు మరికొంత మంది వైసీపీ నేతలు ఉన్నారని విమర్శలు గుప్పించారు.
Also Read: సీఎంగా పవన్..? రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. ఏం అన్నారంటే?
అదాన్ డిస్టలరీస్ వెనుక విజయసాయిరెడ్డి ఉన్నారని అన్నారు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. ఎస్.పి.వై ఆగ్రోస్ వెనుక మిధున్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు హయాంలోనే బ్రాండ్లకు అనుమతినిచ్చారని అన్నారు. కాని వైసిపి హయాంలోనే బ్రాండ్లు వచ్చాయని దుయ్యబట్టారు. గతంలో మద్యం యజమానుల వివరాలను ప్రకటించాలని సవాల్ చేశామని..కాని ఆ సవాల్ కు ప్రభుత్వం ఇంత వరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ లో పవన్, కిషన్ రెడ్డి.. పొడవనున్న బీజేపీ-జనసేన పొత్తు?
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వద్ద 100కు డిస్టలరీ కంపెనీలు నమోదయ్యాయని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. కానీ 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయని ఆరోపించారు. వైసీపీ నేతలకు చెందిన కంపెనీల నుండే అత్యధికంగా ఏపీ ప్రభుత్వం మధ్యం కొనుగోలు చేస్తుందని ధ్వజమెత్తారు. వైసీపీ సర్కారు మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.