MP Lakshman: విభజన హామీలపై ఇద్దరు సీఎంలు చర్చించాలి: ఎంపీ లక్ష్మణ్‌

TG: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలి ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. కేంద్రం రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు.

New Update
MP Lakshman: విభజన హామీలపై ఇద్దరు సీఎంలు చర్చించాలి: ఎంపీ లక్ష్మణ్‌

MP Lakshman: రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవ్వడంపై స్పందించారు బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్. రెండు రాష్ట్ర సీఎంలు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. కేంద్రం రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. తిరుపతి పవిత్రతను కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు.

370 ఆర్టికల్ తర్వాత మోదీ జమ్మూ కశ్మీర్ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిందని అన్నారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేసిందని మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే బీజేపీ వ్యతిరేకించిందని స్పష్టత ఇచ్చారు. రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు