/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MP-Bandi-Sanjay-jpg.webp)
BJP MP Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీ భస్మాసుర అస్త్రాన్ని తీసుకురావట్లేదని అన్నారు బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ తమ ప్రచారానికి గాడిద గుడ్డు తీసుకువస్తుందని ఎద్దేవా చేశారు. బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.. కానీ తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ ఇచ్చిందే గాడిద గుడ్డు అని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ గాడిదగుడ్డు ఇచ్చిందని విమర్శించారు. తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు ఇచ్చిందని అన్నారు. ఆరు గ్యారెంటీలతో మోసగించిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు.