Eatala Rajendar: కాళేశ్వరంతో లక్ష కోట్లు గంగ పాలు.. కేసీఆరే కారణం: ఈటల తూటాలు

కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను గొప్పల కోసం నిర్మించి లక్ష కోట్లు గంగ పాలు చేశాడని బీజేపీ నేత ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. కనీసం సాయిల్ టెస్ట్ కూడా సరిగా చేయలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఘటనకు బాధ్యత వహించి సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని ఈటల డిమాండ్ చేశారు

Eatala Rajendar: కాళేశ్వరంతో లక్ష కోట్లు గంగ పాలు.. కేసీఆరే కారణం: ఈటల తూటాలు
New Update

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajendar) డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంతకు ముందు కట్టిన ప్రాజెక్ట్ లు ఏమీ దెబ్బ తినలేదన్నారు. కానీ కేసీఆర్ (KCR) ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం మూడు ప్రాజెక్ట్ లు దెబ్బతిన్నాయని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టుల కోసం సెలక్ట్ చేసిన సైట్ కరెక్ట్ కాదన్నారు. సాయిల్ టెస్ట్ కూడా సరిగా చేయలేదని ఆరోపించారు. ప్రాజెక్ట్ ను రికార్డ్ కోసం నిర్మించి, గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు. లక్ష్మి బ్యారేజ్ ను ఇసుక మీద కట్టారన్నారు. అన్ని పిల్లర్ లను చెక్ చేస్తే తప్పా.. ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అనేది తేలుతుందన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నీళ్లు వదలడంతో మోటర్లన్నీ కొట్టుకుపోయాయన్నారు. గొర్లు, బర్లు కూడా కొట్టుకు పోయాయన్నారు.
ఇది కూడా చదవండి: కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మీద లేదు..కేటీఆర్ ది బిచ్చపు బతుకు..!!

ఆ స్థానంలో మనషులు ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు సమాచారం ఇవ్వకుండా.. తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన మోడల్ ప్రకారం నిర్మించామని.. ఇది తమకు సంబంధం లేదని కాంట్రాక్టర్ లు అంటున్నారన్నారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు గంగ పాలు చేశాడని ధ్వజమెత్తారు ఈటల. దీనికి ప్రధాన కారకుడు కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు బండి సంజయ్. దీనికి బాధ్యత వహించి సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. లక్ష్మి బ్యారేజ్ కుంగి పోవడానికి కారణం డిజైన్ లోపమేనన్నారు.

సైన్స్ కి వ్యతిరేకంగా కాళేశ్వరం ప్రాజెక్టులను డిజైన్ చేశారని ధ్వజమెత్తారు. అన్ని విధాలుగా ఆ ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వం చెక్ చేస్తుందన్నారు. ఇది ఓ ఇంజనీర్ బ్లండర్ అని అన్నారు. కాళేశ్వరం పైన ఏరియల్ సర్వే చేశారు కానీ.. ఫిజికల్ సర్వే చేయలేదని రిటైర్డ్ ఐఏఎస్ రామ చంద్రుడు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లకు అనుమతులు రావడంలో తాను కూడా భాగస్వామినని అన్నారు. ఇంజనీర్లు కూడా కేసీఆర్ ఏది చెబితే అది ఒకే అన్నారన్నారు.

#bjp #politics #etala-rajender
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe