Alleti Maheshwar Reddy: ఏడాదికి రూ.40,000 కోట్లు.. సీఎం రేవంత్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి సంచలన ఆరోపణలు

TG: సీఎం రేవంత్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో RRR ట్యాక్స్ పేరుతో భవన నిర్మాణ రంగంలో బిల్డర్స్ నుంచి వసూళ్ల పర్వం కొనసాగుతోందని అన్నారు. RRR అంటే రాహుల్, రేవంత్, రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని అన్నారు.

New Update
Alleti Maheshwar Reddy: రేవంత్ పాలనలో చీకటి జీవోలు, చీకటి ఒప్పందాల: ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి

Alleti Maheshwar Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ట్యాక్స్ పేరుతో భవన నిర్మాణ రంగంలో బిల్డర్స్ నుంచి వసూళ్ల పర్వం కొనసాగుతోందని ఆరోపించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ట్యాక్స్ అంటే.. R అంటే రాహుల్ గాంధీ R అంటే రేవంత్ రెడ్డి R అంటే రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని నిర్వచించారు. అబద్దాల పునాదుల మీద సీఎం పదవిని చేపట్టిన రేవంత్.. రాష్ట్రాన్ని దోచునేందుకు శాయ శక్తుల ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

ALSO READ: ఎన్నికల ప్రచారంపై నిషేధం.. కేసీఆర్ కీలక నిర్ణయం

సెటిల్మెంట్ల అడ్డాగా హైదరాబాద్‌..

హైదరాబాద్‌ను సెటిల్మెంట్ బ్రాండ్‌గా మార్చారని మీడియా సమావేశంలో దుయ్యబట్టారు. ''ఏడాది కడుపు కట్టుకుంటే 40 వేల కోట్ల రూపాయలు వస్తాయని రేవంత్ అంటుండు. ఏ కడుపు కట్టుకుంటే వస్తాయి? రాష్ట్ర మిగులుకి 40 వేల కోట్లకు ఏమైనా సంబంధం ఉందా? ఇది ఏరకంగా ప్రభుత్వ ఆదాయం అవుతదో చెప్పాలి. అధికారంలోకి వచ్చిన మూడున్నర నెలల తర్వాత క‌న్‌స్ట్రక్షన్‌కు పర్మిషన్స్ ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? హైదరాబాద్‌ను సెటిల్మెంట్ బ్రాండ్‌గా మార్చారు.

దీంతో అనేక నిర్మాణ కంపెనీలు భయపడి రాష్ట్రానికి రావట్లేదు. దీనికి కారణం సీఎం రేవంత్ అసమర్థత, ట్యాక్స్‌ల పేరుతో వసూళ్ళు మాత్రమే. గతంలో కేటీఆర్ ఫ్లోర్ లెక్కన తీసుకుంటే.. రేవంత్ మాత్రం నగదు కావాలని అడుగుతున్నాడంట. ఆర్‌ఆర్‌ఆర్‌ టాక్స్‌కి రసీదులు ఉండవు, చెక్కులు ఉండవు. అన్ని క్యాష్ అండ్ క్యారీనే. రాష్ట్రంలో బిల్లులు లేకుండా కొత్త తరహా పన్నులతో వేల కోట్ల అవినీతి జరుగుతోంది. బిల్డర్స్ ఫ్లోర్‌లు ఇస్తామంటే రేవంత్ రెడ్డి క్యాష్ కావాలని అంటున్నారట. వసూల్ చేసిన దాంట్లో చారాణా ఢిల్లీకి పంపి.. బారాణా రేవంత్ పెట్టుకుంటున్నారు'' అని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు