మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి.. వార్నింగ్ ఇచ్చిన బీజేపీ లీడర్స్..!

మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు నగరిలోని బీజేపీ నాయకులు. పురందరేశ్వరిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రజలు కష్టాలు పడుతుంటే మంత్రి రోజా ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి.. వార్నింగ్ ఇచ్చిన బీజేపీ లీడర్స్..!

BJP leaders: బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందరేశ్వరిపై మంత్రి రోజా(Minister Roja) చేసిన వ్యాఖ్యలకు నిరసన చేపట్టారు బీజేపీ నాయకులు. నగరి నియోజకవర్గంలో నిరసన ర్యాలీ చేశారు. ఈ క్రమంలోనే  నగరిలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి రోజా పై విమర్శలు గుప్పించారు. పురందరేశ్వరిపై మంత్రి రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మాజీ మంత్రి కోడాలి నాని, మంత్రి రోజా, వైసీపీ విజయసాయిరెడ్డి వీరందరూ  పురందేశ్వరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also read: ఆర్మీ జవాన్ పై పోలీసుల దాడి.. అనకాపల్లి జిల్లా ఎస్పీ సీరియస్‌ యాక్షన్‌..!

నగరి నియోజకవర్గంలో తాగు నీరు సరిగా లేక ప్రజలు కష్టాలు పడుతుంటే మంత్రి రోజా మాత్రం సీఎం జగన్ కళ్లల్లో సంతోషం నింపెందుకు ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు బీజేపీ నాయకులు. నగరిలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పురందరేశ్వరి పై నోటికి వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని హెచ్చరించారు. పురందేశ్వరి లాంటి కూతురు శ్రతువుకి కూడా పుట్టకూడదని ఏలా విమర్శిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనపై ప్రశ్నిస్తున్నందుకు వ్యక్తిగత విషయాలపై దూషించడం కరెక్ట్ కాదని సూచించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను బహిరంగంగా ఆధారాలతో బయటపెడతామని హెచ్చరించారు బీజేపీ నాయకులు.

కాగా, పురందేశ్వరిని బీజేపీ నుంచి తరిమేయాలని ఆ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు మంత్రి రోజా. ఆమె వల్ల పార్టీకి ఉపయోగం లేకపోగా.. ఉన్న ఓట్లుకూడా పోయేలా ఉన్నాయని, ఆమె బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉంటూ టీడీపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. పార్టీ విధి విధానాలను పక్కనపెట్టి టీడీపీ కోసం పనిచేస్తున్నారని, ఇకనైనా బీజేపీ నాయకులు కళ్లు తెరవాలని కోరారు రోజా. సీఎం జగన్ పై ఉన్న కేసుల్ని త్వరగా విచారించాలంటూ పురందేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం శోచనీయమన్నారు. తండ్రికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు పురందేశ్వరి సపోర్ట్ చేయడం సిగ్గుచేటని దూషించారు.

Advertisment
తాజా కథనాలు