Vijaya Shanti: నేను పార్టీ మారడం లేదు.. బీజేపీలోనే ఉంటా.. విజయశాంతి వెల్లడి

తాను బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై విజయశాంతి స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. బీజేపీలోనే కొనసాగుతానని వెల్లడించారు.

New Update
Vijaya Shanti: నేను పార్టీ మారడం లేదు.. బీజేపీలోనే ఉంటా.. విజయశాంతి వెల్లడి

BJP Leader Vijaya Shanthi: తెలంగాణ రాజకీయాలు అందరిని కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తున్నాయి. పూటకో డ్రెస్ వేసుకున్నట్లు రాజకీయ నేతలు పూటకో పార్టీలో చేరి వివిధ పార్టీల కండువా కప్పుకోవడమే ఇందుకు నిదర్శనం. కరువు కాటకాలు వచ్చి ప్రజలు వలసలు వెళ్తుంటారు. కానీ, రాజకీయ నాయకులు మాత్రం అధికారం కోసం వివిధ పార్టీలకు వలసలు వెళ్తారని తెలంగాణ ప్రజలు ఇంటి ముందు అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్న ముచ్చట.

ALSO READ: బిగ్ బాస్ ఫేమ్, నటి అరెస్ట్.. ఎందుకంటే?

గత కొన్ని రోజులుగా విజయశాంతి బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారని, బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు తెలిసిందే. అయితే, నిన్న (శనివారం) కాంగ్రెస్ నేత మల్లు రవి.. విజయశాంతి కూడా ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కొందరు నేతలు ఏకంగా బ్యానర్లు కూడా కొట్టించారట. అయితే, ఒకవేళ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మరి ఆ బ్యానర్లు ఏం చేస్తారో చూడాలి.

తాజాగా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై విజయశాంతి స్పందించారు. తాను బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని పేర్కొన్నారు. తాను బీజేపీలోనే కొనసాగనున్నట్లు వెల్లడించారు. నిన్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రధాని మోదీ సభకు హాజరైన ఆమె మాట్లాడుతూ.. తాను బీజేపీని ఎందుకు వీడుతానని ప్రశ్నించి ఊహాగానాలకు చెక్ పెట్టారు. మరి విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని బ్యానర్లు కొట్టించిన వారు ఇప్పుడు ఆ బ్యానర్లు ఏం చేస్తారో చూడాలి మరి.

ALSO READ: పట్టపగలే గ్రామ వాలంటీర్ దారుణ హత్య.. ఎక్కడంటే?

Advertisment
తాజా కథనాలు