Raghunandan Rao on Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తమకు అనుమానాలు ఉన్నాయని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్ వెనకాల మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ (Megha Infrastructures ) ఉందన్నారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం L&T వరకే కాళేశ్వరం స్కామ్ ను పరిమితం చేయాలని చూస్తోందని ఆరోపించారు. మేఘా కంపెనీకి కర్ణాటకలో కొన్ని ప్రాజెక్ట్స్ దక్కాయన్నారు. అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఓ ప్రజాప్రతినిధిని మేఘా పెద్దలు కలిసినట్టు సమాచారం ఉందన్నారు. దీంతో మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు రఘునందన్.
ఇది కూడా చదవండి: మేమూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం.. స్పీకర్ కు హరీశ్ రావు లేఖ
మేఘా కరప్షన్ మీద సీబిఐ విచారణకు ఆదేశించాలని రేవంత్ (Cm Revanth) కేంద్రాన్ని కోరాలని డిమాండ్ చేశారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ (CBI Enquiry) చేయాలని అమిత్ షా కు లేఖ రాశారని గుర్తు చేశారు. మరి ఇప్పుడెందుకు కాళేశ్వరం అవినీతి పై సీబీఐ విచారణకు రేవంత్ లేఖ రాయట్లేదు? అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కావాలంటే తాను ఇస్తానన్నారు. ఇప్పటికే వారికి నేను ఆధారాలు పంపించానన్నారు.
కాళేశ్వరం లో జరిగిన అవినీతి పై రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ నివేదిక అడిగిందదన్నారు. మార్చ్ 2023 లోనే ఈ మేరకు కాగ్ లేఖ పంపిందన్నారు. కానీ.. తమ బండారం ఎక్కడ బయట పడుతుందని భయపడి ఆ లేఖను నాటి ప్రభుత్వం దాచి పెట్టిందని ఆరోపించారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో (Kaleshwaram Project) జరిగిందన్నారు.
కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదని.. ఆ బ్యారేజ్ ప్రాజెక్ట్ లో చిన్న భాగమేనన్నారు. అయితే.. కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టేసి.. కేవలం మెడిగడ్డ వరకే చర్చ సాగుతోందని ఆరోపించారు. ప్రాజెక్ట్ కుంగినప్పుడు మేడిగడ్డ సందర్శనకు వెళ్లిన రాహూల్ గాంధీ కాళేశ్వరం సొమ్మును రికవరీ చేసి .. ప్రజల ఖాతాలో వేస్తామని చెప్పిన మాటేమిటి? అని ప్రశ్నించారు.